₹ 170
నెనరులు
- నా జన్మకు కారణమై... నాకు మంచి చదువు, సంస్కారాన్ని అందించిన నా తల్లిదండ్రులు విజయలక్ష్మి, జయదేవ్ గార్లకు
-
- చిన్నపుడు, చూసిన ప్రతిదీ నాదైన శైలిలో వ్రాయమని నన్ను ప్రోత్సహించి అప్పుడప్పుడు బలవంతంగా వ్రాయించిన మా తాత పైన అప్పుడు కోపం వచ్చినా, ఆయన వేసిన ఆ బీజాలే మొలకెత్తాయి అని భావిస్తున్నాను. భౌతికంగా మమ్మల్ని దశాబ్దం క్రితం వదిలి వెళ్ళిన సర్వేశ్వరయ్య గారికి
-
- టీవీ లేని ఇంటిని ఈ కాలంలో ఎవరూ ఊహించలేరు, కానీ మా అమ్మమ్మ, తాత దాని రుచి నాకు చిన్నప్పుడే చూపించారు, మిథునంలో అప్పదాసు ఇంటికి ఏ మాత్రం తీసిపోదు ఒక్కటే తేడా ఆవు దూడ లేవు అంతే. అక్కడ గడిపిన సమయం నాకు ఏకాంతాన్ని ఆస్వాదించటం నేర్పింది. అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. తన క్రియేటివిటీతో నాకు ఆసక్తిగా కథలు చెప్తూ ఊహాలోకాలను చూపిస్తూ జోకొట్టిన అమ్మమ్మ రమాదేవి, తాత శేషాద్రి శర్మ గార్ల
-
- నేను జీవితంలో ఏదో సాధించాలి అని కోరుకునే మేనమామ ప్రసన్న కుమార్, అత్త సౌజన్య గార్లకు
-
- 2014లో ఆకెళ్ల రాఘవేంద్ర గారి పరిచయంతో నా తెలుగు అభ్యాసం మళ్ళీ మొదలు అయ్యింది. నాలోని హిడెన్ టాలెంట్ని గుర్తించింది వారే... తెలుగులోని గొప్పతనాన్ని తెలిపి, సాహిత్యాన్ని ఆస్వాదించే లాగా చేసారు... ఎలా మాట్లాడాలో నేర్పి, సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసారు. వారి ఆఫీసులోనే నేను మొదటిసారి షార్ట్ ఫిల్మికి డైలాగులు వ్రాసాను. నాకోసం తను చాలా దీక్షగా వ్రాస్తున్న పుస్తకాన్ని పక్కనపెట్టి, నా నవల పూర్తిగా చదివి ముందుమాటతోపాటు నా తదుపరి రచనలు ఎలా ఉండాలో మార్గనిర్దేశం చేసిన మోటివేష్నల్ స్పీకర్, రైటర్, అకాడమీషియన్ నా గురువు ఆకెళ్ల రాఘవేంద్ర గారికి
- Title :Nee Chupu Chepindi Naaku
- Author :Koratamaddi Hemanth
- Publisher :Godavari Prachuranalu
- ISBN :MANIMN5278
- Binding :Papar Back
- Published Date :2024
- Number Of Pages :149
- Language :Telugu
- Availability :instock