స్త్రీలు
కారుణ్య స్త్రీలు
పుట్టెడు దుఃఖాన్ని పుట్టుకతో తెచ్చుకున్న స్త్రీలు
కన్నీటి స్త్రీలు
కన్నీటిని ఉమ్మనీటిలాగా కడుపున దాచుకున్న స్త్రీలు
కంటున్నది స్త్రీలనో, పురుషులనో తెలీకనే ప్రేమిస్తున్న స్త్రీలు
బలహీన స్త్రీలు, దృఢమైన స్త్రీలు
రాయిలాంటి స్త్రీలు, వీర స్త్రీలు
రెపరెపలాడుతున్న వస్త్రాలు
నిగనిగలాడుతున్న నగలు
నడిచొచ్చే నవ్వులు
కడతేరని ఏడుపులు
స్త్రీలు- స్త్రీలనే ద్వేషిస్తున్న స్త్రీలు
పురుషుల్ని ప్రేమించే
పురుషుడు లేక జీవించలేని
పురుష స్త్రీలు-
కుటుంబాల్ని నమ్ముకున్న అమాయకులు
కుటుంబాల్ని త్యజించిన వ్యథాభరితులు
ఒంటరి స్త్రీలు
అనేక పురుషులకు ఉపశమనాన్నిచ్చే స్త్రీలు
అనేక పురుషుల్తో శమిస్తున్న స్త్రీలు
వేశ్యా స్వేచ్ఛలు
పతివ్రతా పతితులు...........