• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Neelam Note Book

Neelam Note Book By Nidamarty Uma Rajeswararao

₹ 150

నీలం నోట్బుక్ కథా సందర్భం

రష్యాలో, 1917 ఫిబ్రవరిలో బూర్జువా ప్రజాతంత్ర విప్లవం ప్రారంభమై నప్పుడు లెనిన్ స్విట్జర్లాండులో వున్నాడు.

దాదాపు పదేళ్ళ ప్రవాస జీవితానంతరం 1917 ఏప్రియల్ 3వ తేదీన పెట్రోగ్రాడ్కు తిరిగి వచ్చిన లెనిన్, విప్లవోద్యమ సారథ్యాన్ని వహించి, భూస్వాముల ఎస్టేట్లను వ్యవసాయ కార్మికులు, బీద రైతులు ఆక్రమించుకోవాలని, అధికారం అంతా కార్మిక, కర్షక ప్రతినిధుల సోవియట్లకు దఖలు పడాలని పిలుపిచ్చాడు. విప్లవ ప్రతీఘాత ప్రభుత్వం లెనిన్ అరెస్టుకు వారంటు జారీచేసి, ఆయనను పట్టుకుని చంపివేయాలని శాయశక్తులా ప్రయత్నించింది. కాని కమ్యూనిస్టు పార్టీ, విప్లవకారులైన కార్మికులు లెనిన్ను పెట్రోగ్రాడ్ సమీపంలోని రజీవ్ సరస్సు తీరంలో దాచారు. కేంద్రకమిటీ నిర్ణయం మేరకు, యిక్కడ ఆయన ఎమెలనోవ్ అనే ఒక కార్మికుని గుడిసెలో రహస్య జీవితం గడిపారు. గడ్డికోసే వానిలా గడుపుతూ వ్యాసాలు, లేఖలూ రాస్తూ, "రాజ్యము- విప్లవం” అన్న పుస్తకం రాస్తూ ఆయన అక్కడ గడిపారు. ఆ రోజుల్లో ఆయనతోబాటు జినోవీవ్ కూడా వున్నాడు.

పెట్రోగ్రాడ్లోవున్న తన భార్య నాడెజ్జా కృపస్కయా దగ్గర్నుండి ఒక "నీలం నోట్బుక్"ను తెప్పించుకుని, అందులో మార్పు, ఎంగెల్సుల రచనల నుండి తాను వ్రాసుకున్న నోట్సును ఆధారంగా చేసుకుని లెనిన్ తన రచనలను సాగించాడు. ఆ "నీలం నోట్బుక్” చేతికి వచ్చేదాకా ఆయనపడిన తపనా, అదివచ్చాక ఆయన పొందిన ఆనందం అత్యంత ఆసక్తిదాయకమైనవి.

దైనందిన జీవితంలో లెనిన్ అలవాట్లూ, అరమరికలులేని ప్రవర్తన, పిల్లలపట్ల ప్రేమానురాగాలు, నిర్విరామ కృషిచేసే శక్తియుక్తులు, పట్టువిడుపులు, లెనిన్-జినోవీవుల మధ్య వచ్చిన సైద్ధాంతిక విభేదాలను తెలిపే కజకేవిచ్ నవల 'నీలం నోట్బుక్.....................

  • Title :Neelam Note Book
  • Author :Nidamarty Uma Rajeswararao
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN4452
  • Binding :Papar back
  • Published Date :May, 2023
  • Number Of Pages :127
  • Language :Telugu
  • Availability :instock