₹ 120
మందరపు హైమవతి కవితా ముద్ర తెలుగు స్త్రీ వాద కవిత్వంలో చేరగనిది. తనదైన ప్రత్యేక స్వరంలో స్త్రీ ఆర్తిని, ఆవేశాన్ని, ఆగ్రహాన్ని, ప్రేమను, ప్రేమ రాహిత్య జివిత వేదనలను, ఆర్ధిక సంబంధాల ప్రభావంతో ఛిద్రమవుతున్న స్త్రీ పురుష సంబంధాలను కావిత్వికరించిన అపురూప కవయిత్రి మందరపు హైమవతి. స్త్రీ వాదపు తొలినాళ్ళ నుంచి ఆ మార్గం నుంచి తప్పుకోకుండా, ఇప్పటివరకూ స్త్రీ జీవితాలలోని చిన్న చిన్న నిరాశలను కూడా కవిత్వంగా మలిచింది. ఆమె దృష్టి స్థూల, సూక్ష్మ అంశాల పై సమానంగా ప్రసరిస్తుంది. ఆ దృష్టి స్త్రీల దృష్టి కనుక ఆ అంశాలు మున్నెన్నడూ చూడని రీతిలో కవిత్వంలో వ్యక్తమవుతాయి. సర్ప పరిష్వoగం నుండి నీలి గోరింట వరకు హైమావతి తన ప్రత్యక దృష్టిని, దృక్పథాన్ని, స్వరాన్ని శైలిని కాపాడుకుంటూ, పదునెక్కించుకుంటూ వచ్చిన క్రమం ఆసక్తికరం.
-మందరపు హైమవతి.
- Title :Neeligorinta
- Author :Mandarapu Hymavathi
- Publisher :Prajashakthi Book House
- ISBN :MANIMN0631
- Binding :Paperback
- Published Date :2018
- Number Of Pages :183
- Language :Telugu
- Availability :instock