• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nemaru
₹ 350

బద్ధకిష్టుడు!

పెద్ద నాలుగయిదు రోజులకొచ్చేసింది.

తెల్లారుజాము నాలుగింటికే ఊరు ఊరంతా జూలు విదిలించింది.

పేడ కల్లాపులూ, ముగ్గులు, గొబ్బిళ్ల హడావిడి పుంజుకుంది.

నొక్కుల జుట్టూ పచ్చని చాయా - లావూ సన్నం కాకుండా కాస్త పొట్టిగా ఉన్న ముప్పయ్యేళ్ల యువతి-నిండు గర్భిణి!-ఇంటి ముందు రథం ముగ్గేస్తోంది. అయిదుగురు కొడుకులు తల్లి ఆమె! ఈసారయినా ఓ ఆడపిల్ల పుట్టి, ముందుముందు ముగ్గులూ, గొబ్బిళ్లూ, బొమ్మల కొలువుల హడావిడి నెత్తినేసుకోవాలన్నది ఆమె చిరుకోరిక.

అరుగుమీద కూర్చుని అక్క వేస్తున్న ముగ్గును చూస్తున్నాడో పదహారేళ్ల బక్కపలచని, చామనచాయ కుర్రాడు. పుష్యమాసపు చలికి గొంతుక్కూర్చుని, చేతులు రెండూ కాళ్లకి పెనవేశాడా కుర్రాడు. ముగ్గు పూర్తవుతూండగా, ఆమె కడుపులో ఏదో కదిలినట్టైంది. పళ్లబిగువున చేతిలో పని పూర్తిచేసింది. ముగ్గు బుట్ట అరుగుమీద పెట్టిన అక్క మొహంకేసి అనుమానంగా చూశాడా కుర్రాడు.

'అక్క మొహం మామూలుగా లేదివాళ!' అనుకుంటూండగానే ఆమె మెలికలు తిరిగిపోవడం ఆ కుర్రాడు గమనించాడు.

"అమ్మా! అక్కకేదో అయినట్టుందే....” అన్న ఆ కుర్రాడి కేక విని ఓ భారీ కాయురాలు - అంతంత అంగలతో-వీథిలోకి పరుగున వచ్చింది.

"చోద్యం చూస్తున్నావేమిట్రా, వెళ్లి రిక్షా కట్టించుకురా!" గర్భిణిని పట్టుకుంటూ కుర్రాణ్ణి గదమాయింది భారీకాయురాలు. “అలాగలాగే.... తిన్నగా ఆస్పత్రికేగా?" అని అడుగుతూనే రోడ్డుమీదికి దూకేశాడు ఆ కుర్రాడు..................

***

  • Title :Nemaru
  • Author :Dusanapudi Vanidevi
  • Publisher :Tenali Prachuranalu
  • ISBN :MANIMN4756
  • Binding :Paerback
  • Published Date :2023
  • Number Of Pages :323
  • Language :Telugu
  • Availability :instock