ధర్మం
వాకిట్లో నిలబడున్న వ్యక్తి "లోపలకి రండి... అన్నయ్య లోపలే ఉన్నారు" అన్నాడు. అతనెవరో తెలియడంలేదు. నేను అతనికి 'నమస్కారం' అంటూ చెప్పులు విడిచిపెట్టాను.
అతను వొంగి నా చెప్పులు చేతికి తీసుకున్నాడు. “బయటే వదిలే కుక్కలెత్తుకుపోతాయి... లోపలికి పదండి.”
విశాలమైన రాతి అరుగు. అవతల మండువాలో ముదురుటెండ తెల్లటి తెరలా నేల మీద పరుచుకునుంది. ఒకవైపు పొడవైన అరుగులాంటి గదిలో ఒక పెద్దాయన పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఒడిలో ఇత్తడి తాంబూలం పెట్టె, అడకత్తెరతో వక్కల్ని చిన్న చిన్న ముక్కలు చేస్తున్నారు. ముఖం మీది కళ్ళజోడు కొంచం కిందకి జారిన ఆయన వాలకం చూస్తుంటే ఇష్టమైన ఆటలో మునిగిపోయున్న పసిపిల్లవాడిలా ఉంది.
నన్ను ఇందాక ఇంటిలోపలికి ఆహ్వానించిన వ్యక్తి నా వెనకే వచ్చి, "రచయిత జయమోహన్ వచ్చారు..." అన్నాడు. నా పేరును అతను రెండు,,,,,,,,,,,,,,,,,,,,,