• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nenenduku Hinduvuni Kakunda Poyanu (RSS Savaasam Pattina Oka Dalithuni Athmakatha)

Nenenduku Hinduvuni Kakunda Poyanu (RSS Savaasam Pattina Oka Dalithuni Athmakatha) By K Satya Ranjan

₹ 300

రామనామము, రామ నామము

'బాబ్రీ మసీదు - రామజన్మభూమి వివాదం తారాస్థాయికి చేరుకున్న రోజుల గురించి నే చెబుతున్నా. అప్పట్లో 'బచ్చా బచ్చా రామ్ కా / జన్మభూమి కామ్ కా/ జన్మభూమి కె కామ్ నా ఆయీ / వో బేకార్ జవాన్ హై/ జిస్ హిందూ కా ఖూన్ నా ఖులే / ఖూన్ నహీ వో పానీ హై' అన్న నినాదాలు ఎక్కడ బట్టినా వినబడుతుండేవి.

అది 1990 అక్టోబర్ నెల నాది పదిహేనేళ్ళ వయసు. పదో తరగతి చదువు తున్నాను. నా స్వంత ఊరు భిల్వారా, మాండల్ తాలూకాలో ఉన్న సర్డియా అనే గ్రామానికి అయోధ్యలో రాములోరి గుడి కట్టి తీరాలి అనే ప్రచారానికి వెళ్ళాం. గుడి కట్టేదానికి ఉపయోగించాల్సిన ఇటుకలు ప్రార్థనల ద్వారా పరమపూజ్యం కావించబడ్డాయి. రామజన్మ భూమిలో గుడికట్టే పవిత్రకర సేవలో పాల్గొని నిజమైన స్వయం సేవకుడిగా నన్ను నేను నిరూపించుకోవాలని తహతహలాడి పోతున్నా. మొత్తానికి ఎల్లా అయితేనేం రాములోరి గుడి కట్టడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడిన కరసేవక సైన్యంలో నాకూ చోటు దక్కింది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పారిపోయి నేను కరసేవకుల్లో కలిసాను. అయోధ్యకు బయల్దేరడానికి ముందు మాండల తాలూకాలో అనేక చోట్ల మేం ప్రదర్శనలు నిర్వహించాం. నాకు పట్టరానంత ఆనందంగా ఉంది. నాకు ఇంకా బాగా గుర్తే. మెళ్ళో దండలు వేసుకుని, తలకి కాషాయరంగు గుడ్డ చుట్టుకుని, నుదుటిన ఎర్రటి బొట్టు దిద్దుకోని పిడికిళ్ళు బిగించి భూమ్యాకాశాలు దద్దరిల్లేలా జై శ్రీరామ్, జైజై శ్రీ రామ్ అని నినాదాలు ఇచ్చుకుంటూ పూనకం పట్టిన వాళ్ళలా ఆ ప్రదర్శనల్లో పాల్గొన్నా. ఏ నోటవిన్నా “రామ్ జీకే నామ్ పర్ జో మర్ జాయేగా!

దునియా మే నామ్ అప్నా అమర్ కర్ జాయేగా" అన్న నినాదమే.

ముల్లాయమ్సింగ్ (అప్పటి యు.పి. ముఖ్యమంత్రి ముస్లిం అనుకూలుడని ముద్రవేసి ఆర్.యస్.యస్ శక్తులు ములాయమిసింగ్ యాదవ న్ను 'ముల్లా'యమిసింగ్ అని గేలి చేసేవి- అను) హిందూ వ్యతిరేక పోలీసు పటాలం మమ్మల్ని ఎదుర్కోనుందని,.........................

  • Title :Nenenduku Hinduvuni Kakunda Poyanu (RSS Savaasam Pattina Oka Dalithuni Athmakatha)
  • Author :K Satya Ranjan
  • Publisher :Hydrabad Book Trust
  • ISBN :MANIMN5569
  • Binding :Papar Back
  • Published Date :Jan, 2024
  • Number Of Pages :199
  • Language :Telugu
  • Availability :instock