• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nenika Yudhalu Cheyanu! Eka Sainikudiga Vundanu!

Nenika Yudhalu Cheyanu! Eka Sainikudiga Vundanu! By Ranganayakamma

₹ 80

ముందు మాట

ఈ సంపుటంలో ఒక నవలికా, 15 వ్యాసాలూ ఉన్నాయి. వ్యాసాలన్నీ పత్రికల్లో వచ్చినవే. నవలికని ఏ పత్రికకీ పంపలేదు. నవలిక గురించి కొంత చెప్పాలి.

రష్యా, ఉక్రెయిన్ మీద మొదలుపెట్టిన దురాక్రమణ యుద్ధం గురించి ఈ సంవత్సరంలోనే, మార్చిలో, ఒక వ్యాసం రాశాను. అప్పుడు యుద్ధం మీద ఆందోళనతో, 'ఒక కధ రాద్దాం' అని నాకు అనిపించలేదు. యుద్ధాలు వుండకూడదనే అభిప్రాయమే గానీ, దాని కోసం కధ ఆలోచనే లేదు. కొంత కాలానికి, ఆ ఆలోచన ప్రారంభమైంది గానీ, ఆ కధ గురించి, ఏ విషయమూ స్పష్టంగా మనసులో లేదు. కేవలం అదో ఆలోచన! యుద్ధాల మీద తీవ్ర నిరసన!

అయినా, కొన్ని నెలల్లో బైల్దేరింది కధా వస్తువు. గడిచిన సెప్టెంబరు 29న కధని రాయడం మొదలు పెట్టాను. నిజానికి అప్పటికీ నా ఆరోగ్యం తగినంతగా బాగుపడిందేమీ లేదు. చక చకా నడిచే శక్తి కాళ్ళకి పోయింది. ఇతర నొప్పులేవీ దేహంలో లేవు గానీ, 3 యేళ్ళనించీ 'తిండి తినడం లేదనే' చెప్పుకోవచ్చు. చివరికి జబ్బు బైటపడి, 2 పెద్ద ఆపరేషన్లు జరిగి, ఈ నాటికి పొట్ట మీద 'హెర్నియా' అనేది ఒకటీ! కడుపులో ఒక చోట, పైకి ఉబ్బడమూ, శ్రద్ధగా పడుకుంటే అది కడుపుతో సమానం అయిపోవడమూ జరుగుతాయి. దానివల్ల ప్రస్తుతం ఏ బాధా లేదు. ఏమో, ఎప్పుడు మొదలవుతుందో తెలీదు.

కధ రాయడం మొదలైనప్పుడు, దాని వరసా వాయీ ఎలా వుండాలో ఏమీ తయారై లేదు. అయినా, సమాజంలో జరిగే తప్పుల మీద విమర్శలతో మొదలుపెట్టి, 'చూద్దాం ఎలా వెళ్తుందో! నచ్చితేనే చేద్దాం, లేకపోతే వూరుకుందాం' అనే

ఆలోచనతోనే సాగింది.

'ముందుమాట' ని రాయడం మానేద్దామనుకున్నాను గానీ, గతం లో ఒక పుస్తకానికి 'ముందుమాట' లేకుండా చేస్తే, పాఠకుల్లో కొందరు చాలా నిరుత్సాహపడ్డారు. 'ముందుమాట' వుంటే, రచయితే పాఠకులతో మాట్లాడుతున్నట్టు అవుతుంది' అన్నారు. అందుకే, నిజంగా తగిన ఓపిక లేకపోయినా ఏదో రాశాను. చాలు! ఆపేస్తాను!..............

  • Title :Nenika Yudhalu Cheyanu! Eka Sainikudiga Vundanu!
  • Author :Ranganayakamma
  • Publisher :Sweet Home Publications
  • ISBN :MANIMN3999
  • Binding :Papar back
  • Published Date :Dec, 2022
  • Number Of Pages :157
  • Language :Telugu
  • Availability :instock