అరికాళ్ళ మాటలు
అప్పుడప్పుడూ ఇలా మనుషులంతా
గడ్డకట్టుకు పోతుంటారు
నెత్తురోడుతున్న పాదాలు
బాటంతా పూచిన మోదుగుపూలు
శరీరాలన్నీ ఎర్రెర్రని సూర్యుళ్ళను
తొడుక్కున్నాయి
పచ్చడి మెతుకులు కూడా కోల్పోతున్న
నేలతల్లి బిడ్డలందరూ ఆరుద్రలై
ఎర్రజెండాల రెపరెపల్తో
ఇవాళో రేపో అన్ని తారీఖులు
నిర్ణయమైన వాళ్ళుకూడా ఆశచావని హృదయంతో
గెలుపు మనదేనన్న ధైర్యంతో
ఒంటి నిండా బట్టల్లేక పోయినా
కాళ్ళన్నీ సిమెంట్ తినేసిన పుండ్లయినా
ఆగని ఆపని మొక్కవోని ధైర్యం వాళ్ళది
రక్తసిక్త పాదం
మనందరి నుదిటిమీద.................