• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nenu Kasturbaa Ni

Nenu Kasturbaa Ni By Chandakacharla Ramesh Babu

₹ 250

రావి అరుగు-వేపచెట్టు

ఒక జీవితకాలంలో ఎన్నో బ్రతుకులు బ్రతికిన గాంధి అనే వ్యక్తిత్వం ఆశ్చర్యాన్నీ, ప్రశ్నలనూ జంటగా మన ముందుంచుతుంది. అదే సమయంలో ఆయనే స్థాపించిన పార్టీ - దేశం ఎందుకిలా అయ్యాయి అనే అందోళనను కలిగించేలా ప్రస్తుత పరిస్థితులు తయారయ్యాయి. ఇవన్నిటి నడుమ గాంధి-150 వచ్చి వెళ్ళింది. ఇది కస్తూర్ బా-150 కూడా కాబట్టి కస్తూర్ బా జీవిత చరిత్ర రాయాలి అని ఏ గడియలోనో నాలో మొలకెత్తింది. రాస్తూపోయిన కొద్దీ దీని గురించిన విస్తృత అధ్యయనం అవసరమయ్యింది.

కుగ్రామంలో పెరుగుతూ, చేతికందింది చదువుతూ ఉన్న నాకు మొట్టమొదట అందినవారు గాంధి. అది కూడా అయన ఆత్మకథ ద్వారా. కాలక్రమేణ ఆయన ప్రభావం నా దుస్తులు, మాటతీరు, గుణాల పైన కలిగిందని నాకే అర్థమవసాగింది. క్రమేణ నాకు దారిదీపాలుగా నిలిచిన బాబాసాహేబ్ గారు, మహాత్ములు, గురువులు, స్నేహితులు గాంధీని నేపథ్యానికి జరిపేశారు. గాంధి నీడనుండి. ప్రభావం నుండి తప్పించుకోవడానికి నేను ప్రయత్నించాను. ఇవన్నీ జరిగే సమయంలోనే చరిత్రను, ఐతిహాసిక వ్యక్తులను వారి స్నేహితుల దృష్టితో చూడాలనే మహిళా దృష్టికోణపు అవసరాన్ని నేను, నా స్నేహితురాళ్ళు చర్చించేవాళ్ళము. అలా యశోధర, సావిత్రిబాయి, చెన్ని, రమాబాయి, కస్తూర్ బా మొదలైన ఆడవాళ్ళ జీవిత వివరాలు మమ్మల్ని ఎక్కువగా ఆకర్షించసాగాయి..

గాంధి కస్తూర్ గార్లు జన్మించిన 150 సంవత్సరం వచ్చింది. మహిళా...............

  • Title :Nenu Kasturbaa Ni
  • Author :Chandakacharla Ramesh Babu
  • Publisher :Chayya Resources center
  • ISBN :MANIMN5213
  • Binding :Papar back
  • Published Date :Dec, 2023
  • Number Of Pages :222
  • Language :Telugu
  • Availability :instock