• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nenu Na Amaravathi

Nenu Na Amaravathi By Potula Balakotaiah

₹ 250

అమరావతి అజరామరం

తెలుగునేల చరిత్రలో మహోన్నతమైన, అజరామరమైన, సువర్ణ లిఖిత ఉద్యమం అమరావతి మహోద్యమం. రాజధాని కొరకు భూములు ఇచ్చిన రైతులు చేసిన ఉద్యమం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా అవశేషాంధ్రప్రదేశ్ హైదరాబాద్ను కోల్పోతే, విధిలేని పరిస్థితుల్లో నూతన ఆంధ్రప్రదేశ్కు రాజధాని అవశ్యకత ఏర్పడింది. ఇందుకు రైతుల భూములు అవసరమయ్యాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో నా పిలుపు మేరకు రైతులు 34 వేల ఎకరాలను ఇచ్చారు. రాష్ట్రంలోని రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ఇలా మూడు ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా, మధ్యస్థంగా, రవాణా, విమాన మార్గాలకు దగ్గరగా ఉండేలా, దూరదృష్టితో అమరావతి నిర్మాణం చేపట్టాము.

50 లక్షల మంది జనసాంద్రత ఉండేలా, భవిష్యత్తు తరాలకు కూడా నీటి ఎద్దడి లేని విధంగా కృష్ణానది తీరాన నిర్మాణం జరిగింది. చాలా తక్కువ కాలంలో అంటే, రెండేళ్ళలోనే పాలనకు అవసరమైన శాసనసభ, సచివాలయం, శాసనమండలి, హైకోర్టు నిర్మాణాలను పూర్తి చేసి పరిపాలన కూడా అమరావతి నుంచి చేపట్టాము. నాడు అసెంబ్లీలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అంగీకరించిన ప్రతిపక్షం అధికారంలోకి రాగానే మాట మార్చి మూడు ముక్కలాటకు తెరలేపింది. ఫలితంగా భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం చేపట్టారు. మరోమారు నన్ను ముఖ్యమంత్రిని చేయటంలో రాజధాని రైతులు ఉద్యమ పాత్రను నేను మరువలేను.

తెలుగు నేల గర్వించదగిన అమరావతి మహోద్యమంపై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు, జర్నలిస్టు పోతుల బాలకోటయ్య గారు 'నేను నా అమరావతి' పేరిట పుస్తకం తీసుకువస్తున్నందుకు సంతోషంగా ఉంది. రాజధాని ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని, రైతులతో పాటు అన్ని ఇబ్బందులను ఎదుర్కొన్న బాలకోటయ్య గారు రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అణగారిన వర్గాల గొంతుకను, భాగస్వామ్యాన్ని చాటి చెప్పారు. రాజధాని పోరాటంలో బాలకోటయ్య గారి కృషి నాకు బాగా తెలుసు. ఆయన స్వయంగా అమరావతి ఉద్యమంపై పుస్తకం రాయటం అభినందనీయం. చరిత్రలో రాజధాని ఉద్యమం ఉన్నంతవరకు 'నేను- నా అమరావతి' పుస్తకం కూడా నిలిచి ఉంటుందని తెలియజేస్తున్నాను.......................

  • Title :Nenu Na Amaravathi
  • Author :Potula Balakotaiah
  • Publisher :Jayanthi Publications
  • ISBN :MANIMN6479
  • Binding :Papar Back
  • Published Date :Feb, 2025
  • Number Of Pages :220
  • Language :Telugu
  • Availability :instock