అందుకే ఈ పుస్తకం
ఒకటిన్నర దశాబ్దం క్రితం ....
నా మిత్రుడు వల్లీశ్వర్ ఈ డాక్టర్ కృష్ణ గారిని పరిచయం చేశారు. చాలా మంది డాక్టర్ల లాగానే ఈయన కూడా ఒక డాక్టర్ అనుకున్నాను మొట్టమొదట చూసినప్పుడు.
కానీ, ఈయన తన వృత్తినే ప్రవృత్తిగా మార్చుకున్న విశిష్ట వైద్యుడు. .
పాత కాలంలో గ్రామాల్లో కుటుంబ (ఆయుర్వేద) వైద్యులు పలకరించినట్లుగా రోగిని పరామర్శించటం,
రోగికి తాను చెప్పే రోగ నిర్ధారణ వివరణ సంతృప్తికరంగా కనిపించేదాకా విషయాన్ని వివరించటం,
రోగి పరిస్థితిని బట్టి అవసరమైన సందర్భాలలో తన పరిధికి మించి సహాయపడటం,
ముందే రోగికి సగం రోగం తగ్గించేలా చతురోక్తులతో మాట్లాడుతూ భరోసా ఇవ్వటం ....
... ఇలాంటి గుణాలని తన సహజ జీవన విధానంగా మలచుకున్న ఎముకల బౌAJA RUSS S S .
నను. అనే సంస్థ రూపుదిద్దుకుంది. ఒంటరి జీవితాల్లో నవ్వుల్నీ, వెలుగుల్ని నింపుతోంది.
మా ఇద్దరి మిత్ర బృందంలో - జస్టిస్ అప్పారావు, డాక్టర్ బి.వి.పట్టాభిరామ్, శ్రీ బుద్ధవరపు సీతారాం, శ్రీ మరువాడ రాజేశ్వర రావు వంటి సహృదయులు ఉండటం నాకు ఆనందం కలిగించే విషయం. " అలాంటి మిత్రుడు కృష్ణ గారి జీవితకథ నలుగురూ తెలుసుకోదగింది.
అందుకే ఈ పుస్తకం. భగవంతుడు ఆయనకు పరిపూర్ణ ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని
కోరుకుంటున్నాను.
ఎమెస్కో విజయకుమార్