• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nerastula Samskarana

Nerastula Samskarana By Hemalatha Lavanam

₹ 400

ఆనాటి ఎరుకల వెంకన్న

అర్ధరూపాయి కిరాయి వుండగా బేరమాడి పావలాకు ఒప్పించుకొని ఒక వ్యాపారిని అడవి దాటిస్తున్నాడు కాపలాదారు ఎరుకల షోడే వెంకను నాయకురాలి కనుమ వద్దకు రాగానే దొంగల గుంపు ఒకటి ఊడలుదిగిన మర్రిచెట్టు క్రింద ఈతకల్లు త్రాగుతూ కనిపించింది. దొంగలను చూచిన వ్యాపారి నిలువెల్లా ఒణికిపోతూ అడుగు ముందుకువేయలేదు.

అది వేసవి. ఆకులు రాల్చుకొన్న చెట్టుమోదులు చేతులుచాచి అందుకోబోతున్నట్లున్నాయి. వణికిపోతున్న వ్యాపారిని చూచి " నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డంవేస్తాను దొరా. నా ప్రాణం పోతేగాని నిన్ను దొంగలు ముట్టుకోరు. నా వెనుకనే రా దొరా” అంటూ వెంకన్న నాటు తుపాకీ దొంగల వైపు గురిపెట్టి నడుస్తున్నాడు.

అడవి గువ్వలు 'గూ' పెడుతున్నాయి. నెమళ్ళు గీరగా అరుస్తున్నాయి. ఎండుటాకులు మీదుగా సుడిగాలి గిరగిరాతిరిగి చుట్టలు చుట్టలుగా ఆకులను పైకిలేపి సుడి చుట్టుకుంటూ పోతున్నది.

దొంగలు వెంకన్నను, వ్యాపారిని చూచి ఎదురువస్తున్నారు. "ఆగురోరి ఎంకా! ఆగురోరి, మాచేత దొరికినావు ఆగురోరి" అంటూ నాయకుడు ముందుకు వస్తున్నాడు. "మీ పేనాల మీద తీపి వుంటే మా దగ్గరకు రాకురోరి" గంభీరంగా అరిచాడు ఇరవై అయిదేండ్ల వెంకన్న. దొంగ ఎరుకలు ఆ మాటలు లెక్కచేయలేదు.

ఎండ మిట్టిపడుతున్నది వడగాడ్పు ఎండిన కొమ్మల నుండి దూసు కొస్తున్నది, కీచురాళ్ళు గీమంటూ చెవులు దిబ్బెలుపడేట్టు చేస్తున్నాయి. ఈతకల్లు త్రాగి మత్తెక్కిన దొంగలు వారి ఆరడుగుల నాయకుణ్ణి, బలిసి కండలు తిరిగిన వారి నల్లనిశరీరాలు గోచితప్ప మరో ఆచ్ఛాదనలేని వారిని నిలువెల్లా పరికించితే ఆ మహాడవిలో ఒళ్ళు జలదరిస్తుంది. ఆ నల్లనిశరీరాల్లో ఎక్కడా లొత్తలేదు. కల్లుతాగి కళ్ళు మంకెన పూలలాగా వున్నాయి. వారికి నాలుగున్నర అడుగుల ఎత్తున్న బలశాలి నేరస్తుల సంస్కరణ......................

  • Title :Nerastula Samskarana
  • Author :Hemalatha Lavanam
  • Publisher :Praja Shakthi Book House
  • ISBN :MANIMN6514
  • Binding :Papar back
  • Published Date :Sep, 2025 2nd print
  • Number Of Pages :331
  • Language :Telugu
  • Availability :instock