న్యూ ఏజ్ ఎడ్యుకేషన్
'క్లీం' - మానవజాతి చరిత్రలో 'హ్రీం' 'శ్రీం' 'క్లీం' అనే ఈ మూడు బీజాక్షరాలు పృథ్విని స్వర్గంగా మార్చడానికి కావలసిన శక్తులు. 'హ్రీం' - 'శ్రీం' - 'క్లీం' అనేవి మూడు బీజాక్షరాలు అంటే మూడు ఆవరణలు. సాధారణంగా మనిషి 'క్లీం' పరిధిలో జీవిస్తాడు అంటే అతడి సొంత నిర్ణయాలు ఏమీ ఉండవు. ఆకలి వేస్తే అన్నం తింటాడు, దాహం వేస్తే నీళ్ళు త్రాగుతాడు, పిల్లలు పుట్టారు కనుక పెంచుతాడు, పెంచాడు కనుక చదివిస్తాడు. ఆ చదువు కూడా సమాజం ఏం చెప్పితే ఆ చదువు చదివిస్తాడు. సమాజంలో ఉన్న చదువులు చదివించగలమే తప్ప సమాజంలో లేనటువంటి చదువులు మనం చదివించలేం. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం రాదు. మనం సమయాన్ని ఉపయోగించు కోకుండా, సమయం మనల్ని ఉపయోగించుకుంటోంది కనుక మనం సాధకులం కానే కాదు. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునేవారు 'క్లీం' బీజ సాధకులు. ఎవరి పవిత్రమైన శరీరం కాలం మీద...............