వేలాది సంవత్సరాలుగా వేదాంతుల్ని ఆలోచనలతో ముంచెత్తిన కలలు ఇప్పుడు నవీన శాస్త్రజ్ఞుల శల్యపరీక్షకు నోచుకుంటున్నాయి. ప్రతి ఒక్కరం మనకు వచ్చిన కొన్ని కలల్ని గురించి నెమరువేసుకుంటూ ఆ కలలకు కారణమేమిటా అని మధనపడడం సహజమే కదా!
స్పష్టాస్పష్టరూపాలు, ఆలోచనలు, ఉద్వేగాలు కలబోసిన దృశ్యాల్ని నిద్రా సమయంలో మనోఫలకంపై చూస్తూ అవి కలిగించే ఆనంద భయాది భావాల్ని అనుభవించి, ఒక్కోసారి కారణం అర్థమై ఒక్కోసారి అర్థం కాక మనలో మనమే తర్కించుకుంటాం.
కలలకు అర్థం లేదని కొందరు శాస్త్రజ్ఞులు భావిస్తే ఎర్నెస్ట్ హాఫ్ మాన్ అనే బోస్టన్ శాస్త్రజ్ఞుడు కలలు వ్యక్తి మానసిక వికాసానికి, ఉద్వేగ నియంత్రణకు, అత్యయిక పరిస్థితులను తట్టుకునే శక్తినివ్వడానికి తోడ్పడుతాయని వివరించాడు.
విడుదలైన ఆరునెలల్లోనే అన్ని కాపీలు అమ్ముడైన స్వప్నశాస్త్రంను ఆదరించినట్లే ఈ పుస్తకాన్ని కూడ తెలుగు సాహిత్యలోకం అభిమానించి అక్కున జేర్చుకుంటుందని సృజనలోకం మనసారా ఆశిస్తున్నది.