మొదటి అడుగు
నా లాడ్జి నుండి బయటికి వచ్చి రద్దీగా ఉండే వీధిలోకి అడుగు పెట్టాను. ఒక సైకిల్ రిక్షాను గుర్తించి, దానిని ఆగమన్నట్టుగా చెయ్యి ఊపాను.
' ఎక్కడికి?' అన్నాడు రిక్షా నడిపేవాడు.
'ఘాట్.”
'ఏ ఘాట్ ? ఇక్కడ చాలా ఉన్నాయి'
ఇలాంటి ప్రశ్న ఎదురౌతుందని నేను ఊహించలేదు. వారణాసిలో చాలా ఘాట్లు ఉన్నాయని నాకేం తెలుసు?
“ఏదో ఒక ఘాటు నన్ను తీసుకెళ్లు'
'అలా ఏదో ఘాట్ కు నేను మిమ్మల్ని తీసుకెళ్లలేను సార్. అక్కడకి వెళ్లాక మీరు నేను వెళ్ళాలనుకున్న చోటు ఇది కాదు అంటారు'
'సరే, ఒక ఘాట్ పేరు చెప్పు'
'దశాశ్వమేధ ఘాట్ '
' అక్కడికే పద'
రిక్షా నెమ్మదిగా కదులుతోంది.. నాలో ఆలోచలు మాత్రం వేగంగా....
1995 నుండి రిక్షా ఎక్కలేదు. ఇప్పటికి, పదిహేను సంవత్సరాల క్రితం, నేను కుర్రాడిగా ఉన్నప్పుడు భౌతికవాదం వైపు ఆకర్షితుడయ్యాను. ఎప్పుడూ ఆ ధ్యాసలో ఉండేవాడిని. ఇప్పుడు, ముప్పై ఏళ్ళ వయసులో, నేను దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాను. వాహనం మారలేదు కానీ దిశ మారింది; వ్యక్తి మారలేదు కానీ ప్రాధాన్యతలు మారాయి. నిజం చెప్పాలంటే................