పద చిత్రాలు
నడిరాత్రి ఒంటరి రోడ్డుకు
తోడుగా నడుస్తున్నాను
పువ్వును మోయలేని రెమ్మకు
కొమ్మ ఆసరా యిచ్చింది.
కొమ్మను కన్నందుకు
చెట్టు గర్వంగా వూగుతూంది!
మబ్బులు గూళ్ళకు చేరుకున్నాయి.
చంద్రుడు వొక్కడే నింగికి కాపలా
ఒంటరి నా నడకకు
జంటగా చేరింది గ్రామసింహం!
వెలుగును చూసి ముచ్చటపడి
వీధి దీపం చుట్టూ ఉసుళ్ళు అట్లాడుతూ.
ఆత్మాహుతి ఔతున్నాయి!
యమభటులు పాశం వేసి లాగుతుంటే
ఓ తల్లి ఘోషకు శునకం
గుండె కరిగి నిల్చి చూసింది!
గాలి సుగంధమై మనసును
కమ్మితే అప్పుడే వెలిగిన
ఆ ఇంటి దీపం.....................