పసిఫిక్ సముద్రానికి ఓ వంద గజాల దూరంలో కాలిఫోర్నియాలోని కారానా బీచ్ కి దగ్గర్లో నీల్ ప్రత్యేక శిక్షణా తరగతులు నేర్పే సైనిక శిబిరాలున్నాయి. ఓ మూడంతస్తుల భవనం. ఊరూ పేరు లేని భవనం అది. ఆ భవనంలో ఎయిర్ కండిషన్ సదుపాయం లేదు; రాత్రి పూట, కిటికీలు తెరుచుకుని చూస్తుంటే అలల సవ్వడి విన్పిస్తూ ఉంటుంది. కెరటాలు వచ్చి ఇసుకను తాకిన చప్పుడు కూడా అలవోకగా చెవులకు సోకుతూ ఉంటుంది.
ఆ సైనిక శిబిరంలోని గదులన్నీ మామూలుగా ఉండేవి. ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేని ప్రదేశం అది. ఆఫీసర్ గదులు కూడా అవే. నేను మరో ముగ్గురు అధికారులతో కలిసి ఉండేవాణ్ణి. నాలుగు పడకలుండేవి. యూనిఫాంలు వేళ్లాడదీయటానికి ఓ చిలక్కొయ్య ఉండేది. ఇంకేం లేవు. ఆ రోజుల్లో ఉదయాన్నే నేను నా నేవీ రాక్ లోంచి బయటకొచ్చి నా పక్క సరిచేసుకునే ప్రయత్నంలో పడేవాణ్ణి. రోజు ప్రారంభించటానికి అదే నా మొదటి పని. నా దిన చర్య దానితోనే మొదలు అయ్యేది. రోజంతా. యూనిఫామ్ తనిఖీ చేయటం, ఎక్కువ సేపు ఈత ఈదటంలో గడపటం, పరుగులు తియ్యటం, కొన్ని కొన్ని గతి నిరోధాల మీద నుంచి దూకటం, సీల్ శిక్షణాధికారుల దగ్గర్నుంచి ఒకటే వేధింపులు. వీటితో రోజంతా గడిచేది.
మా తరగతి నాయకుడి స్వరం పెద్దగా వినపడేది. "అందరూ సావధానంగా వినండి..” ఆయన పేరు - లెఫ్టినెంట్ జూనియర్ గ్రేడ్...............