మనిషి తనను తాను మనిషని మర్చిపోయి యెప్పుడో మరణించి ప్రేతాత్మల్లా బతుకుతున్న క్రూర క్షుభిత కాలమిది. మనుషుల తమను తాము టీచర్లు, డాక్టర్లు, లాయర్లు, పొలిటీషియన్లు, స్టార్లు, కమెడియన్లు, గుమాస్తాలు, పోలీసులు, రచయితలూ, విప్లవకారులు, గాయకులు, కవులు, చిత్రకారులు, మేనేజర్లు, పబ్లిషర్లు, పాత్రికేయులు, యాంకర్లు, సీఈవోలు, ఇంజనీర్లు యింకా తాము చేస్తున్న పనితాలూకూ సూడో ఐడెంటిటీలో పడి ఆ వెల్లువలో పూచిక పుల్లలుగా కొట్టుకుపోతున్న కనాకష్టపు యీ కలికాల క్షణాల్లో నీది... నాది... మనందరి జీవితాలు playing to the galleryగా మారిపోయిన | మార్చేసిన వర్చువల్ రియల్ లైవ్ డేలో శంకరన్ తన ఉద్యోగంలో హెూదాలో immerse కాలేదు... తన జీవితాంతం తానొక సామాన్య మానవుడనే స్పృహ తనకు నిరంతరం ఉండబట్టే వందమంది అధికారుల పని ఒక్కడే చేయగలిగాడు. ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువచేయగలిగాడు. బడుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయాడు. Its great to be great, but its grater to be human శంకరన్ కృషిని, వ్యక్తిత్వాన్ని బహుముఖాలుగా అర్థంచేయించే ఒకే ఒక పుస్తకమిది. ప్రముఖులందరూ ఈ సామాన్యుడి గురించి ఏం చెప్పారో మీరూ తెలుసుకోండి.