• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nishacarulu

Nishacarulu By Sri Dharan Kanduri

₹ 270

తమిళదేశ గ్రామ దేవతల నిశిరాత్రి సంచార యదార్ధ విశేషములు?

అనాదికాలం నుండి ద్రవిడ నాగరికతకు తమిళదేశం (నేటి తమిళనాడు) ప్రధాన కేంద్రంగా గుర్తించబడింది. ఆర్య నాగరికతకు చెందిన ఉత్తర భారతదేశంలో వైదిక దైవాలను ఆరాధించటం జరుగుతుంది. కానీ, తమిళదేశంలో గ్రామ దేవతలను ప్రముఖంగా పూజించటం జరుగుతుంది. గ్రామ దేవతలు మహా శక్తివంతులని, ఆ దేవతలు - మానవులను భూత, ప్రేతాల బారి నుండి మరియు భయంకరమైన అంటువ్యాధుల బారినుండి రక్షిస్తాయని తమిళ ప్రజలు ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా విశ్వసిస్తున్నారు. వారి విశ్వాసాన్ని బలపరచే ఎన్నో యదార్థ సంఘటనలు తమిళనాడులోని అనేక గ్రామ ప్రాంతాలలో అనాదికాలం నుండి ఈనాటి వరకూ జరుగుతున్నాయని అనేకమంది పాశ్చాత్య పారాసైకాలజిస్టులు మరియు పరిశోధకులు తీర్మానించారు.

గ్రామ దేవతలందరిలోను అత్యంత శక్తివంతుడని గుర్తించబడిన "అయ్యన్నార్” యొక్క రాతి విగ్రహాలు తమిళనాడులోని గ్రామాలన్నింటిలోనూ కనిపిస్తాయి. ప్రతి తమిళ గ్రామం చివరి భాగంలో "అయ్యన్నార్"కి ఒక ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో బ్రాహ్మణేతర కులానికి చెందిన పూజారులు ఈ గ్రామ దైవానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా, తమిళ గ్రామ దేవతలు అందరూ గుర్రాలపై కూర్చుని ఉన్నట్లుగా కనిపిస్తారు. (గుర్రాలపై కూర్చుని ఉండే విగ్రహాలు అన్నమాట). ఈ "అయ్యన్నార్” కూడా ఒక విగ్రహంమీద కూర్చుని, కుడిచేత్తో ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకుని కనిపిస్తాడు. తమిళనాడులో ఈనాటికీ ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారంచూసినట్లయితే, గ్రామంలో ఉండే గ్రామదేవత, అర్ధరాత్రి సమయంలో యదార్ధ రూపం ధరించి ఆపై, నిజమైన గుర్రంమీద ఆ గ్రామం అంతా తిరుగుతూ ఆ గ్రామంలోకి భూత, ప్రేతాలు రాకుండా అడ్డుకుంటుందని తెలుస్తున్నది.

ఒక విశేషం ఏమంటే, ఒక్కో గ్రామ దేవత, ఒక్కో రంగులో ఉండే గుర్రంమీద సంచరిస్తుందని చెబుతారు. ఉదాహరణకి - "అయ్యన్నార్" తెల్ల రంగులో ఉండే గుర్రం మీద, "కరుప్పర్” అనే పురుష దైవం - గోధుమరంగులో ఉండే గుర్రంమీద కనిపిస్తారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత అనగా, గ్రామంలోని అన్ని గృహాల తలుపులు మూసివేయబడిన తరువాత గ్రామ దేవత లేదా గ్రామ దైవం -............

  • Title :Nishacarulu
  • Author :Sri Dharan Kanduri
  • Publisher :Sri Dharan Kanduri
  • ISBN :MANIMN5147
  • Binding :Papar back
  • Published Date :2024
  • Number Of Pages :286
  • Language :Telugu
  • Availability :instock