₹ 40
ఈనాడు మనిషి పరుగెడుతూ బ్రతుకుతున్నాడు ప్రొద్దున లేచింది మొదలూ పరుగే!
ఆఫీసుకు పరుగు, బస్సు ఎక్కడానికి పరుగు, కాఫీ హోటల్లో పరుగు, సినిమాలో టికెట్ల కోసం పరుగు, కాలేజీలలో సీట్ల కోసం పరుగు, పెళ్ళిసంబంధాల కోసం పరుగు, అల్లుళ్ళకీ, కొడుకులకీ, ఉద్యోగాలకోసం పరుగు, కూతుళ్లూ భార్యలకూ అభిరుచుల నందించడానికి పరుగు, ప్రయాణంలో పరుగు... జీవితం అంతా పరుగెత్తి, పరుగెత్తి... ఆయాసంతో గుండెల్లో రైళ్ళు పరుగెడుతూ బ్రతికే జీవితం.. అంతా ఆయాసమే! అలసటే ! పరుగెత్తలేక, జీవిత కష్టాలను ఎదుర్కోలేక గుండె ఆగిపోయి శాంతిని కోరేదాకా, ఈనాటి ఈ యంత్రాల యుగంలోని మానవుడి జీవనవిధానంలోనే ఒక పెద్ద అశాంతి! లోపం జీవితంలోనే అంటే, జీవించే విధానం లోనే, ఏదో ఒక పెద్ద లోపం - లోటు, ఉండి వుండాలి!
- డా. వేదవ్యాస
- Title :Nitya Jeevitamlo Yogasadhana
- Author :Dr Veda Vyasa
- Publisher :Bharatiya Samskruthi Samuddarana Samsta
- ISBN :MANIMN0497
- Binding :Paperback
- Published Date :2017
- Number Of Pages :122
- Language :Telugu
- Availability :outofstock