భూమి మీద 'రెండు పాదాలు', 'రెండు చేతులు' ఆకాశంవైపు వున్నాయి. క్షణాల్లో ఎగిరిపోయి మేఘాలంచుకు చేరిపోయాడు. చుట్టూరా తిరుగుతూ దృష్టితీరాలవెంట వెళ్తున్నాడు.
'తాటివనం' నుంచి కమ్మని వాసన... చెట్లనుంచి పొంగుతున్న 'నీరా' పరిమళభరితంగా మారింది.
అటువైపు వెళ్లి చేయితో తీసుకుని 'జిహ్వ' కు అందించాడు. ఆ.. హా.. రెండుచేతుల్లో పోసుకొని తాగుతూనే ఉన్నాడు. మైకం కమ్మింది.. ఆహా.. ఎంత మధురం?...
ప్రకృతి ఎంత గొప్పదో ప్రతి ఋతువుకాలంలో ఒక ఫలం, ద్రవ్యం మనిషికి కమ్మగా అందిస్తుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువును ఇస్తుంది. కానీ! 'మనిషి ప్రకృతికి తిరిగేమిచ్చాడు?... కాలుష్యం 'రిటర్న్' ఇస్తూ ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాడు.
'తాటికొమ్మల అలజడిలో వస్తున్న శబ్దం 'సంగీతంలా' వినిపించింది. చేతులు ఊపుకుంటూ డాన్స్ చేస్తూ... కూనిరాగాలు తీస్తూ... మళ్లీ 'నీరా' ద్రవ్యాన్ని బాగా పుచ్చుకున్నాడు'. ఆ... హా... ఇక చాలు ఇవ్వాల్టికి... అనుకుంటూ భూమికి దగ్గరగా వచ్చాడు.
'హైటెన్షన్ వైర్లు పట్టుకుని ఊయలలూగాడు. మళ్లీ రివ్వున ఆకాశంవైపుకు వెళ్లాడు గాలి పటంలా తిరుగుతూ..
"కిందికి చూసాడు'. 'సమాంతరంగా, పచ్చగా పరుచుకున్న చెట్లు
కొమ్మలపై పడుకున్నాడు'.