నారాయణ్ రావ్ పవార్
1309 ఫస్లీ అంటే సరిగ్గా 1900 సంవత్సరంలో బీదర్ జిల్లా బాల్కీ తాలూకా దేబ్కా గ్రామంల వచ్చిన డొక్కల కరువు వలన మా నాయన పండరీనాథ్ కొందరు బంధువులు, స్నేహితులతో కలిసి అక్కడి నుండి వరంగల్కు బ్రతకటానికి వలస వచ్చాడు.
వరంగల్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో ముందు కూలీగా ఆ తర్వాత హమాలీగా అక్కడే పని చేశాడు. ఆయన వెంబడి ఆయన మేనల్లుడు జనార్దన్ రావ్ షిండే కూడా వచ్చాడు. అతణ్ణి చదివించి పెంచి పెద్ద చేసింది మా నాయినే. అతను మెట్రిక్యులేషన్ వరకు చదివి వరంగల్ ఆజంజాహీ బట్టల మిల్లులో టైమ్కీపర్గా నౌఖరీ చేశాడు. మా నాయిన కొంచెం సంపాదన వెనుక వేసిన తర్వాత వరంగల్కు దగ్గరలో ఉన్న గొర్రెకుంట గ్రామంలో కొద్దిగా వ్యవసాయ భూమిని కొన్నాడు. ఆ తర్వాత ఆ గ్రామంలోని హరిజనులకు ఉదారంగా అప్పులిచ్చి నష్టపోవటంతో తిరిగి ఆ భూమిని అమ్మివేశాడు.
నేను వరంగల్ స్టేషన్కు దగ్గరలొనే వున్న గోవిందరాజుల గుట్టక్రింది బస్తీలో 3-10-1926న పుట్టాను. మా చుట్టాల ఇండ్లు కూడా పక్కపక్కనే....................