పుడమితల్లి
"పుడమి"పైన ప్రతీ రేణువు వెదజల్లును సౌరభాలు,
మానవాళి ఘనచరితలు, చేపట్టిన ఆశయాలు
సాధించిన విజయాలు, పతనాలు, ప్రయాసలు
పరిణామపు పరంపరాలు, మనము వింటేగా ?
బుద్ధిజీవి సూక్ష్మబుద్ధి
కార్యదీక్ష, దృఢ చిత్తం, పట్టుదల, మొండితనం
కాలాతీత సమయస్ఫూర్తి... చెలరేగిన సంఘర్షణ,
ఎదురేగిన సాహసాలు,
అలుపెరుగని పోరాటం,
ఉప్పొంగిన చైతన్యం,
పంచుకున్న నాగరికత...
పెంచుకున్న మమకారపు అనుభవైక్ష్య
వీచికలు, మనము వింటేగా?
దోపిడీ దౌర్జన్యంలో కడతేరిన జీవితాలు
కర్మవీరుల ఘర్మజలము,
మేధావుల తపఃఫలము
కవుల కవితలొలుకు వేధనలు
పండితోత్తమ ప్రభలు, కళాకారుల దివ్యదృష్టి...................