• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Nooru Varahaalu

Nooru Varahaalu By Kunda Bhaskara Rao

₹ 200

వరాల వర్షం!

కవులు, నటులు, చిత్రకారులు గురువరుల్
ప్రజల పూజలంది ప్రబలు చోట
వర్షములు కురియు ప్రహర్షముల్ విరియురా!
భాస్కరార్యు మాట! ప్రగతి బాట!!
విన్నకొండ సీమ వినుత ‘నాగులవర’
గ్రామలక్ష్మి చేతి రత్న దీప
మతడు! ‘ఝాన్సి’ విభుడు! మద్దుల శ్రీనివా
సుండు! 'సృజన' ‘లిఖిత' శోభితుండు!!

కళ దైవ స్వరూపం! కళ (Creativity) ఏ రూపంలో ఉన్నా దానిని గుర్తించడ మంటే సాక్షాత్తు దైవాన్ని గుర్తించడమే! ఈ విశ్వానికి సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త మనిషికి అనుగ్రహించిన అద్భుతమైన వరమే సృజనాత్మకత (Creativity).

వెనుకటి రోజుల్లో రాజులు కవులను అర్థ సింహాసన మిచ్చి గౌరవించారు. శ్రీకృష్ణదేవరాయలు- నడి బజారులో మదపు టేనుగు అంబారి ఎక్కి వెళుతూ అల్లసాని పెద్దన కవి ఎదురైతే- ఏనుగును ఆపి తన చేతిని చాపి ఆ మహాకవికి ఎక్కడానికి చేయూత ఇచ్చి గజారోహణం చేయించేవాడట! - సహృదయుడైన సాహిత్యాభిమాని ఎవరైనా ఈ రోజుల్లో కారులో వెళుతూ నడిచివస్తున్న నాలాంటి వాణ్ని చూచి కారు ఆపి “రండి! భాస్కరరావుగారూ! డ్రాప్ చేస్తాను" అని గౌరవించి ఎక్కించుకున్నట్లు!

“ఎదురైనచో తన మద కరీంద్రము డిగ్గి

కేలూత యొసగి ఎక్కించు కొనును”

అంటూ శ్రీకృష్ణదేవరాయల ఔన్నత్యాన్ని కొనియాడతాడు పెద్దన్న ఒక పద్యం!

కళ ఎక్కడ గౌరవింపబడుతుందో, గురువులు ఎక్కడ సత్కరింప బడతారో అక్కడ వర్షాలు, సుఖశాంతులు వెల్లివిరుస్తాయని నానుడి!..............

  • Title :Nooru Varahaalu
  • Author :Kunda Bhaskara Rao
  • Publisher :Srujana Likhita Prachuranalu
  • ISBN :MANIMN4966
  • Binding :Papar back
  • Published Date :NoV, 2023
  • Number Of Pages :214
  • Language :Telugu
  • Availability :instock