బాధ గురించి మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైన విషయము గుర్తుపెట్టుకోవాలి. నేను ఈ పుస్తకంలో బాధను ప్రస్తావించినప్పుడు, మానసికమైన, భావోద్వేగ బాధలను ప్రస్తావిస్తున్నాను. మీ జీవితంలో ఏమి జరిగినా, మీరు ఉద్వేగంతో, మానసికంగా బాధపడాల్సిన అవసరం లేకుండా ఒక మార్గం ఉంది.
- మనం పడే కష్టాలన్నీ మన బుర్రల్లోనే ఉన్నాయని అనడం లేదు. ప్రతిరోజూ ప్రజలకు భయంకరమైన, దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి. నేను చెప్పేది ఏమిటంటే, మన జీవితంలో మనం చాలా మనోవ్యధని అనుభవిస్తున్నప్పటికీ, బాధ ఐచ్ఛికం. మరో మాటలో చెప్పాలంటే, బాధ అనివార్యమయినప్పటికి, మన జీవితంలో జరిగే సంఘటనలు, పరిస్థితులకి మనం ఎలా స్పందిస్తాము అనేది మనపై అది ఆధారపడి ఉంటుంది. అలాగే అది మనం బాధపడాలా వద్దా అనేది కూడా నిర్ణయిస్తుంది.
మన జీవితంలో ఎప్పుడైనా ప్రతికూల సంఘటన జరిగినప్పుడు రెండు బాణాలు మనవైపు దూసుకు వస్తాయని బౌద్దులు చెబుతుంటారు. శారీరిక బాధని కలిగించేది ఒకటైతే, రెండవది భావోద్వేగమైన బాణం తో కొట్టడం, అది మరింత బాధాకరం (మనోవ్యధ).
బుద్ధుడు ఇలా వివరించాడు, "జీవితంలో, మనం ఎల్లప్పుడూ మొదటి బాణాన్ని నియంత్రించలేము. అయితే, రెండవ బాణం మొదటి దానికి మన ప్రతిస్పందన. రెండవ బాణం ఐచ్చికం."
కొన్నేళ్ల క్రితం బుద్దుని ఈ సూక్తి గురించి నేను మొదటిసారి విన్నప్పుడు, అయోమయానికి గురయ్యాను, ఎందుకంటే బుద్ధుడి ఉపదేశం అర్థమైనప్పటికీ, నేను దానిని నా జీవితంలో ఎలా అన్వయించుకోవాలో నాకు తెలియదు. ఎవరికైనా బాధ పడటమా లేదా బాధ పడకుండా ఉండడమా అని నిర్ణయించుకోమంటే, సరైన మనసు ఉన్నవారెవరైనా బాధపడటాన్ని.............