రాజ్యాంగంలోకి
వెళ్లబోయే ముందు...
రాజ్యాంగం అంటే సవాలక్షా రూల్సు, సెక్షన్లూ, క్లాజ్ లు, సబ్ క్లాజులు, తొక్కా తోలూ ఉంటాయనే అపోహతో చదవడం అపేస్తామా ఏంటి? అరే... ఈదేశం, ఈ దేశంలో పనిచేసే వ్యవస్థలన్నీ రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని పనిచేస్తుంటే అసలు ఈ రాజ్యాంగంలో ఏముందో దాని అంతు చూడకుండా ఉంటామా?
ఖబడ్డార్.... ఇదేమన్నా రాకెట్ సైనా? బ్రహ్మపదార్థమా?
పోనీ అర్థం తెలియని సంస్కృత శ్లోకమా?
సింపుల్ గా..... నీళ్ళు తక్కువ ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈత నేర్చుకున్నట్టు రాజ్యాంగాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. దానికి నేను గ్యారెంటీ... ఛలో...
రాజ్యాంగం మీకు సులభంగా అర్థం అవ్వాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఇలా వాడుక భాషలో చర్చిస్తున్నాను. ఈ బుక్ మొత్తం చదివాక 'ఓస్..! ఇంతేనా రాజ్యాంగం అంటే' అని ఒకింత గర్వంగా ఫీల్ అవుతారు. లీగల్ మాటర్స్ & పోటీ పరీక్షల కోసం ఈ బుక్ లోని మేటర్ కరెక్టే అయినా నేను వాడిన భాష మాత్రం ప్రామాణికం కాదని
గమనించాలి.
నేను కష్టమైన పదాలను వాడి మీ బుర్రని హీట్ ఎక్కించాలి అనుకోవడంలేదు. అందుకే ముందుగా అలాంటి కొన్ని కష్టమైన పదాల వివరాల్ని మీతో షేర్ చేసుకొని, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను తమ్ముళ్లూ.... ఆ.........................