అధ్యాయము - 1
ప్రారంభిక వివరణ
PRELIMINARY
Commencement
1) ఈ చట్టము "న్యాయ సేవల అధారిటీల చట్టము 1987” అని పిలువబడవచ్చును.
2) ఇది "జమ్ము కాశ్మీరు రాష్ట్రమునకు తప్ప, భారతదేశము అంతటికి అమలు అవుతుంది.
3) ఇది కేంద్ర ప్రభుత్వము, నోటిఫికేషన్ చేత, నియమించు అటువంటి తేది నుండి, అమలులోనికి వచ్చును. మరియు, ఈ చట్టము యొక్క వివిధ నిబంధనల కొరకు మరియు వివిధ రాష్ట్రములకు వేరు వేరు తేదీలు నిర్ణయించబడవచ్చును. మరియు ఏదేని రాష్ట్రమునకు సంబంధించి, ఈ చట్టము యొక్క ఏదేని నిబంధన ప్రారంభమునకు, ఏదేని ప్రస్తావన (Reference), ఆ రాష్ట్రములో, ఆ నిబంధన ప్రారంభమునకు, ఒక ప్రస్తావనగా, అన్వయించుకొనబడవలెను.
వివరణ: ఈ చట్టములో అధ్యాయము 3 తప్ప అన్ని నిబంధనలు 9-11-1995 నుండి అమలు చేయబడినవి.
1) ఈ చట్టములో, సందర్భము వేరు విధముగా కోరినపుడు తప్ప :-
a) దావా (Case) అనగా, ఒక వ్యాజ్యము లేదా ఒక న్యాయస్థానము ముందుగల, ఏదేని కార్యవ్యవహారము;
aa) “కేంద్ర అధారిటీ (Central Authority) అనగా సెక్షను (3) క్రింద ఏర్పాటు చేయబడిన, ఒక "జాతీయ న్యాయ సేవల అధారిటీ", అని అర్ధము.
aaa) "న్యాయస్థానము (Court)" అనగా ఒక సివిల్, క్రిమినల్ లేదా రెవెన్యూ న్యాయస్థానము మరియు అమలులో ఉన్న ఏదేని శాసనము క్రింద న్యాయ నిర్ణయ లేదా...................