న్యాయం నిదురబోయింది....
***********************
“అమ్మా!" పిలుపుకాదు గావుకేక. హడలిపోతూ బయటికి వచ్చింది. శ్రీలక్ష్మి. కోపంతో వణికిపోతూ గుమ్మంలో మధు నిలబడివున్నాడు. తెల్లని మధు ముఖం ఎండలో తిరిగినందుకేమో. ఎఱ్ఱగా తయారయింది. జుట్టంతా రేగి ముఖాన పడింది. "ఏమిట్రా అంతగట్టిగా అరిచావు?"
"అరవక ఏం జెయ్యను? ఒక్క సంవత్సరం గంగపాలయింది. నా చదువు నాశనమైంది. ఛీ! నాదే బుద్ధితక్కువ! పినతండ్రిని నమ్మమని ఎవరు చెప్పారు? ఆ కుటుంబపు బుద్ధులు ఎక్కడికి పోతాయి? మధ్యలో చెడిపోయింది నేను" ఆవేశంగా అరిచాడు మధు.
"ఏమిటిరా ఆ అతి వాగుడు! సంగతి యేమిటో చెప్పరాదూ?"
“ఇందాక గొంతు చించుకు అరిస్తే వినిపించలా?"
"ఏం అరిచావో ఏం పాడో! చిన్నాన్న ఎడిరా?"
"ఏమో, ఎవడినడుగుతున్నావు?” ఒంటికాలిమీద లేచాడు. 'అన్నా' అంటూ వచ్చిన రేణుకను దూరం త్రోశాడు. రేణుక వెనకాలే బయటికి వచ్చిన మణి తెల్లబోయి చూచింది. రేణుకమీద ఈగ వాలితే యిల్లంతా నాట్యంచేసే మథేనా?........