₹ 100
ఒక మానిషి తను పుట్టిన దగ్గర నుండి గిట్టే దాకా చేసే ప్రయాణమే జీవితం అనిపిస్తుంది అలాంటి జీవనయానంలో కూడూ, గుడ్డతో పాటు, గూడు కూడా ఏర్పరుచుకుని, ఒక కంఫర్ట్ జోన్ తయారు చేసుకోవాలని ఎంతో శ్రమ పడతాడు. ఆలా ఏర్పరుచుకున్నవాడు సుఖంగా కాలం గడపొచ్చు కదా? లేదా, నాలుగు నాళ్లు అలా వుంటాడో లేదో దూరదేశాలు పిలుస్తూ వుంటాయి. ఒక్కడి వింతలు, విశేషాలు, ప్రకృతి అందాలు రారమ్మని ఊరిస్తూ ఉంటాయి. దానితో తన స్థిమితమైన, నిమ్మలమైన జీవితం వదిలి సాహసంతో కూడిన ప్రయాణాలను సవాలుగా స్వీకరిస్తూ బయలుదేరుతాడు. వింతేమంటే తను చేరాలన్న గమ్యం చేరి అక్కడి వింతలు, విశేషాలు చూస్తుండగానే మళ్లీ తన గూడు, తన ఊరు, తనవారు గుర్తొచ్చి బెంగ పడిపోవడం. మళ్లీ తన ఇల్లు చేరే వరకు ప్రాణం కుదుట పడకపోవడం.
- Title :Oka Bhargavi Rendu Prayanalu
- Author :Dr Bhargavi
- Publisher :Badari Publications
- ISBN :MANIMN1301
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :92
- Language :Telugu
- Availability :instock