₹ 100
భారతదేశంలో కులవ్యవస్థ ఎప్పుడు పుట్టింది? ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? అనే విషయంలో చాలా మందికి ముఖ్యంగా సంఘసంస్కర్తలు, అభ్యుదయ వాదులు, విప్లవకారులు అయిన వారికి అభిప్రాయ భేదాలున్నప్పటికీ కులాన్ని నిర్ములించాలనే విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు. అయితే దీనిని ఎలా నిర్ములించాలి? అనే విషయంలో మాత్రం దళిత వాదులకూ, కమ్యూనిస్టులకు, హిందూ వాదులకు, సంస్కరణ వాదులకు మధ్య ఎన్నో మాట భేదాలున్నాయి. భారతదేశంలో ఉత్పత్తి సాధనాలను, కులమే అన్నది ఈనాటి దళితుల సైద్ధాంతిక అవగాహన. దళితుల ఆత్మగౌరవం, అభివృద్ధి, సాంఘిక ఆర్ధిక చైతన్య స్థాయి ఈ కుల నిర్మూలనతోనే ముడిపడి వున్నాయి. కనుక ఈ దేశం నుండి కుల విషవృక్షాన్ని కూకటివేళ్లతో పెరికివేయటం అనేది దళితులకు అత్యంత అనివార్యం. కుల నిర్ములనా పోరాటం అనేది దళితజాతుల విముక్తి పోరాటమే. ఒక వ్యవస్థ ద్వారా ప్రయోజనాలు పొందుతున్న వ్యక్తి, ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎన్నటికీ పోరాడలేదు. కుల వ్యవస్థ ద్వారా ఇంతవరకు లబ్దిపొందిన అగ్రవర్ణాల వారు, ఆ వ్యవస్థను నిర్ములించడానికి జరిగే పోరాటంలో కలిసి వస్తారనుకోవడం దళితుల తమనుతాము మోసగించుకోవడమేననేది చార్వాకుల నుండి, నిన్న మొన్నటి కారంచేడు ఘటన దాకా జరిగిన చారిత్రక సుదీర్ఘ ఘటనలే ఇందుకు సాక్షీభూతం.
- డా. ప్రసాదమూర్తి
- Title :Oka Dasabdanni Kudipesina Dalitha Kavitvam
- Author :Dr B R V Prasada Murthy
- Publisher :Bahujana Keratalu
- ISBN :MANIMN0461
- Binding :Paperback
- Published Date :2016
- Number Of Pages :216
- Language :Telugu
- Availability :instock