తపోభంగం
అకస్మాత్తుగా
రాలిపడే క్షణాలను
అరచేయి చాచి
పట్టుకుంటా
ఒక్కో అల కరిగిపోకముందే
గులక రాళ్ళు విసిరేస్తాను
ఎద లోతుల్లో పల్టీలు
నీట మునకలు
గుప్పిట మూస్తే జారిపోయే అనుభూతులు
చెక్కిలిపై జాము రాతిరి జాడలు
తడారిన స్వప్న చారికలు
బిగి సడలిన బాసలు
పెదవి దాటని పద ధ్వనులు
అయినా
అరమోడ్పు కనులు తెరిచి
ఆలకిస్తూనే వుంటాను
అరికాలితో తడుముకుంటూ
పైకి ఎక్కాలనే అనుకుంటాను...........