స్మిషింగ్ - SMSల్లో పొంచిన ముప్పు
అనగనగా ఒక సైబరు కొలను. అందులో బోలెడన్ని చేపలు హాయిగా ఉంటూ వచ్చాయి. వాటిల్లో మూడు చేపల పేర్లు: సుమతి, కాలమతి, మందమతి. మంచి స్నేహితులు. ఒకరి దగ్గర ఉన్నది మిగితా ఇద్దరితో "లైకు. షేరు. సబ్స్క్రైబ్" చేసుకుంటుండేవారు.
సైబరు కొలను ఏమంత సురక్షితమైంది కాదని, హాకర్లు-ఫ్రాక్టర్లు ఎప్పుడన్నా వలేసి పట్టుకోవచ్చునని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆ నోటా ఈ నోటా వినిపిస్తూనే ఉన్నా వాళ్ళెవ్వరూ పెద్ద పట్టించుకోలేదు. ఓ పూట మందమతి వచ్చింది. "లింకు మీద నొక్కకపోతే నా బాంక్ అకౌంట్ బ్లాకు చేసేస్తారని SMS వచ్చింది. అందుకని గాభరా పడి నొక్కేశాను. ఇప్పుడు నా డబ్బులన్నీ కట్ అయిపోతున్నాయి” అని లబోదిబోమంది. సుమతి ఎప్పటికప్పుడు సైబరు సెక్యురిటి సంగతులు తెలుసుకుంటూ ఉంటుంది కాబట్టి, జరిగిన మోసం పసిగట్టి, మందమతి చేత క్రెడిట్ కార్డులు బ్లాక్ (block) చేయించి, బాంక్ అకౌంట్ పాస్వర్డులు మార్పించింది.
"మెసేజి రాగానే ముందూ వెనుకా ఆలోచించాలి. వెంటనే లింకులు నొక్కేయకూడదు" సుమతి నీరసంతో కూడిన విసుగుతో అంది................