• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Ontari Nakshatram

Ontari Nakshatram By Sushila Rayaprolu

₹ 150

ఒంటరి నక్షత్రం

ఉదయం ఇంకా పరుపుపైనే దొర్లుతున్నాడు రవి. సెల్ మోగింది. రవికి ఆదివారం ఇంకా పడుకోవాలనిపిస్తుంది. బద్ధకంగా కాల్ రిసీవ్ చేసుకున్నాడు.

ఆవైపు నుంచి శర్మ. శర్మ ఉదయం ఐదుగంటలకే లేచే అలవాటు. లేస్తూనే స్నానం సంధ్యవార్చడం. ఆ తర్వాతనే కాఫీలూ అన్నీ!

చిన్నతనం ఐదవ ఏటనే ఉపనయనం చేశారు. వాళ్ళ తాతగారు నిత్యాగ్నిహెూత్రుడు. నిప్పులు కడిగే వంశం. ఆయన దగ్గరుండి సంధ్య వార్చడం దేవతార్చన అన్నీ నేర్పించారు. శర్మకు చిన్నతనంలోనే అన్నీ అలవాటయ్యాయి. సంధ్యవార్చకుండా మంచి నీళ్ళయినా ముట్టడు. అందుకని స్నేహితులంతా పిలకబాపనయ్య అని పేరు పెట్టాడు.

"ఏరా నీవు ఉదయమే నిద్రలేచి అందరినీ లేపిస్తావు అని రవి అడిగాడు”.

"అదేమీ కాదు కొంపలంటుకపోతుంటే! ఎనిమిదయ్యింది. మన శాస్త్రి ఆత్మహత్య చేసుకుంటానని మెసేజ్ పెట్టాడు. నేను చూడటమే ఇప్పుడు తొందరగా లేచి ఉన్న పళాన వచ్చెయ్యి. వాడిని ఎలాగయినా ఆపాలి" అని హడావిడిగా చెప్పాడు.

వార్త విన్న రవికి నిద్రమత్తు దిగిపోయింది. హుటాహుటిన తయారయి బయలుదేరాడు. ఇద్దరూ శాస్త్రి రూముకు చేరుకున్నారు. రూము తలుపులు ముందుకేసి ఉన్నాయి. తోయగానే తెరుచుకున్నాయి. ఫ్యానుకు ఉరితాడు బిగుసుకొని పోతుంది. రెండు నిమిషాలు ఆలస్యమయితే బిగుసుకొనిపోయేదే! బతికేవాడు కాదు. స్టూలును తోసేశాడు. రవి వెళ్ళి స్టూలు మీద నిలబెట్టాడు. రవి శర్మ కలిసి తాడును విప్పదీశారు..................

  • Title :Ontari Nakshatram
  • Author :Sushila Rayaprolu
  • Publisher :Vennela Publication
  • ISBN :MANIMN4358
  • Published Date :2023
  • Number Of Pages :224
  • Language :Telugu
  • Availability :instock