ఊరడి
“ద్రాచలానికి నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో 'సీతారామపురం' అనే భద్రాచలానికి 'గ్రామం ఉంది. ఆ గ్రామం పచ్చని పొలాలు, పూలతోటలు, పెద్దపెద్ద చెట్లు, పసందైన పశుసంపదతో పాటు, అక్కడక్కడ మనుషులతో కలకలలాడుతూ ఉంది. ఆ గ్రామం అలా ఉండడానికి కారణం తరతరాలుగా చేస్తున్న 'ఊరడి' పండగ అని అక్కడి వారి నమ్మకం. ఊరడి పండగ చెయ్యకపోతే వర్షాలు సరిగ్గా పడక పంటలు కూడా పండవని వారు విశ్వసిస్తుంటారు.
సీతారామపురంలో మాల, మాదిగ, కమ్మ, కాపు, రెడ్డి, గొల్ల, చాకలి, మంగలి, గౌడ, మేదరి, శూద్ర, తురక, కమ్మరి, కుమ్మరి, నేతకాని, కోయ... ఇలా అన్ని కులమత కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. సీతారామపురం చుట్టూ రకరకాల చెట్లు, ఊడుగు పొదలు, రేగి చెట్లు దట్టంగా ఉన్నాయి. ఆ గ్రామానికి పెద్దలు గంగరాజు(వయసు యాభైరెండు), సాలయ్య (వయసు యాభై). అంతేకాకుండా, ఒక్కో కులానికి ఒక్కో కుల నాయకుడున్నాడు.
సీతారామపురంకి ఉత్తరాన, దక్షిణాన అడవి, కొండలు ఉన్నాయి. తూర్పున కొత్తపేట, పడమరన జాలూరు. ఆ ప్రాంతాన జాలూరే చివరి గ్రామం. ఆ గ్రామం తర్వాత ఇంకే గ్రామాలు లేవు, అడవి మాత్రమే ఉంది. సీతారామపురం, జాలూరు రెండూ అభివృద్ధి కాని గ్రామాలు. ఈ రెండు గ్రామాలు అడవిలో ఉంటాయి. కానీ కొత్తపేట అలా కాదు, కొత్తపేట చిన్న టౌన్. జాలూరు, సీతారామపురం ప్రజలకు ప్రభుత్వ దావఖాన, మండల కార్యాలయం, కళాశాల చదువులు, హాస్టల్ వసతులు, నిత్యావసర వస్తువులు, సరుకులు ఏవి కావాలన్నా కొత్తపేటకే వెళ్ళాలి. సీతారామపురంలో అన్నీ కులాలు కలిపి దాదాపు ఎనిమిది వందల గడపలు ఉంటాయి. సీతారామపురం గ్రామానికి ముందు ముత్యాలమ్మ తల్లి దేవత, పడమరన అంటే గ్రామానికి వెనుక ముత్యాలమ్మ తల్లి తమ్ముడు పోతురాజు దేవుడి గుడి ఉంది.......................