ఊరికే జీవితమై..
నువ్వూ, నీ జీవితమూ మినహా
మనసులో మరేమీ లేని
అనుభవాన్ని పొందావా నువ్వు
ఇది నా ప్రతిభ, విజయం
ఇది నా సంపద, కుటుంబం
నా కీర్తి, అనుభవం అన్నట్లు
ఇది నా జీవితమని
ఎప్పుడైనా తలచావా
ఏమీ లేని జీవితం
ఖాళీ జీవితం
ఎప్పుడైనా తాకిందా నిన్ను
ఆకులమీంచి సంధ్యావర్ణాలు రాలిపోతున్నాయి
పిట్ట ఒకటి ఆకాశాన్ని విదిలించుకొంటూ స్వేచ్ఛలోకి ఎగురుతోంది
ఏ అర్థమూ లేని ఖాళీ చప్పుడొకటి
గాలిలోంచి నీ మీదుగా నిశ్శబ్దంలో కరిగిపోతుంది
ఊరికే చూసావా జీవితాన్ని జీవితంగా
అద్దంలోకి కాక, ఉత్త అద్దాన్ని చూసినట్టు
జీవితంలోకి దూకకుండా ఉత్త జీవితాన్ని చూసావా.......................