• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Oorugani Ooru

Oorugani Ooru By Kotla Vanajata

₹ 150

మనందరి మూలవేదన 'ఊరు గాని ఊరు'

- డా.జె.నీరజ

'అస్తిత్వ పోరాటాల కంటే ఆస్తులు నిలబెట్టుకునే పోరాటాలేం చిన్నవి కావు' అనే ఆర్థికాంశం కేంద్రంగా మారుతున్న ఊర్ల మూలతత్వాన్ని చర్చించిన భిన్నమైన నవల 'ఊరుగాని ఊరు'. తెలుగు కథావరణంలోకి 'ఇత్తు', 'మైదాకు వసంతం' కథాసంపుటులతో వైవిధ్య ఇతివృత్త స్వరాన్ని వినిపించిన కోట్ల వనజాత నవలా ప్రక్రియలోకి కలం మోపడం ఆనందదాయకం. తెలంగాణ నవల కొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తుందనడానికి నిదర్శనం. రచయిత్రి వనజాత తన ఉద్యోగరీత్యా ప్రతినిత్యం ప్రజాక్షేత్రంలో సంచరించే అధికారి. తన పై అధికారులు ఆదేశాలు, క్రిందిస్థాయి ఉద్యోగుల పనితీరుల మధ్య సతమతయ్యే ఒత్తిడిలో కూడా వనజాత తనలోని రచయిత్రిని చైతన్యస్థితిలో నిలుపుకుంది. విధి నిర్వహణలో ఎదురయ్యే అనేక అనుభవాలను, భిన్న మనస్తత్వాలను నిశితంగా పరిశీలిస్తూనే వస్తున్నారు. ప్రభుత్వ అధికారిగా తన పరిమితులను, వ్యవస్థలోని లోపాలను ఆత్మవిమర్శ చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోంచే తన గ్రామ మూలాల్లోంచి పయనిస్తూ వేగంగా మారిపోతున్న ఊరుగాని ఊర్ల వర్తమాన దృశ్యాన్ని ఇలా నవలీకరించారు..................

  • Title :Oorugani Ooru
  • Author :Kotla Vanajata
  • Publisher :Telangana Publications
  • ISBN :MANIMN6498
  • Binding :Papar back
  • Published Date :Nov, 2022
  • Number Of Pages :137
  • Language :Telugu
  • Availability :instock