• Email: support@logilitelugubooks.com
  • Free Shipping for all Orders of 500 and Above/-
Browse categories

Phone : 9550146514

Opera Maalika
₹ 500

ఆముఖము
 

- ఆచార్య పప్పు వేణుగోపాల రావు, D.Litt

శ్రీకళాపూర్ణ డా. తిరుమల కృష్ణదేశికాచార్యులవారు విరచించిన ఒక అనన్యసామాన్యము, అద్వితీయము, బహువిధ రచనా వైదగ్ధ్యము గల ఓపెరా నవరత్నమాలికను గూర్చి వ్రాయుట నా పురాకృత శుభాధిక్యము. ముందు వారే వారి గ్రంథమున తొలి పలుకులలో ఓపెరాను గుఱించి వివరించియున్నారు. దానికి మరి రెండు మాటలు జోడించి ఓపెరా గుఱించి నాకవగతమైన కొన్ని దిక్సూచికలను చదువరులకు దెల్పి పిమ్మట వారి రచనా శిల్పమును పరామర్శించెదను.

తెలుగు భారతి బహుముఖీనము, సుసంపన్నము బహుకళాసమన్వితము. తెలుగున సాహిత్య సంగీత నృత్య నాట్య శిల్పాది కళలను సమాహారముగ ప్రకటించిన అనేక రకములైన రచనలున్నవి. అత్యంత ఆసక్తికరమైన విషయమేమనగా భరతముని నాట్యశాస్త్రము శాతవాహనుల పరిపాలనాకాలమునకు చెందినది. క్రీ. పూ. 2వ శతాబ్దికి చెందినది. ఇంతటి చరిత్ర, సంస్కృతీ గల ఆంధ్రదేశమునకు భరతముని నాట్యశాస్త్రములో విశిష్టమైన స్థానము సూచింపబడినది. 13వ అధ్యాయమున ప్రవృత్తిని వివరించుచూ నాట్యప్రయోగానుసారముగా నాలుగు ప్రాంతములు చెప్పబడినవి:

'అవంతీ - దాక్షిణాత్యాచ- పాంచాలీచ - ఓడ్రమాగధీ' - (నాట్య శాస్త్రము 13-37).

అనగా దేశమున నాలుగు ప్రవృత్తులు నాట్యముననునుసరించి ఉండెడివి. అవంతి, దక్షిణ దేశము, పాంచాలము, ఓడ్రమాగధీ. ఇందు రెండవది దక్షిణభారతం................

  • Title :Opera Maalika
  • Author :Dr Tirumala Krishnadeshikacharyulu
  • Publisher :Emesco Books pvt.L.td.
  • ISBN :MANIMN5504
  • Binding :Papar Back
  • Published Date :April, 2024
  • Number Of Pages :584
  • Language :Telugu
  • Availability :instock