₹ 250
ముప్పయేళ్ళ పాటు ఓషో అసంఖ్యాకంగా వుపన్యాసాలిచ్చారు. వివిధ ఆధ్యాత్మిక, మత, సాహిత్య గ్రంధాల పై వుపన్యాసాలిచ్చారు. అవన్నీ దాదాపు 680 గ్రంథాల్లో మనకు లభ్యమవుతున్నాయి.
ఆధ్యాత్మిక వేత్తలు సత్య ప్రవచనాలు చేసే సందర్భంలో చక్కటి ఎన్నెన్నో కథలు చెబుతారు. అట్లాంటి కథలు చెప్పడంలో ఓషోకు ఎవరూ సాటిరారు. వందల వేల కథలు ఆయన చెప్పాడు. ప్రాచీన వేదాల, వుపనిషత్తుల నించీ, బైబిల్ నించీ, సూఫీ, జైన్ తదితర మత గ్రంథాల నించీ ఆసక్తికరమైన కథల్ని ఆయన చెప్పారు.
అంతేకాక ఇంతవరకూ మనకు తెలియని ఎన్నెన్నో వింత, విచిత్ర కథల్నీ ఆయన చెప్పారు. ఆయన కథల సేకరణకు పరిమితులు, పరిధులు లేవు. ఎందరో సాహిత్యకారులు, సాంఘిక రంగంలోని వ్యక్తుల, చిత్రకారుల, శాస్త్రవేత్తల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కథల్ని కూడా ఆయన చెబుతారు.
ఓషో ఒక కథా సముద్రం, ఆయన కథల కోసం ఆయన గ్రంథాల్ని పరిశోధించాలి. పరిశీలించాలి. ఎందుకంటే ఓషో కథలంటూ ఇప్పటిదాకా రాలేదు.
ఓషో కథల్ని ఆసక్తి కలిగిన వాళ్ళకు అందించే చిన్న ప్రయత్నం, మొదటి ప్రయత్నమిది.
- సౌభాగ్య
- Title :Osho Kathalu
- Author :Soubhagya
- Publisher :Sahithi Publications
- ISBN :MANIMN0471
- Binding :Paperback
- Published Date :2019
- Number Of Pages :440
- Language :Telugu
- Availability :instock