ప్రేమంటే ఏమిటి?
"ప్రేమంటే ఏమిటి?” అని అడిగే పరిస్థితి మనకు దాపురించడం చాలా దురదృష్టకరం. మామూలుగా ప్రేమంటే ఏమిటో అందరికీ తెలిసినప్పటికీ, నిజానికి దాని గురించి ఎవరికీ సరిగా తెలియదు. కానీ, చాలా అరుదుగా కేవలం కొందరికి మాత్రమే ప్రేమంటే ఏమిటో తెలిసింది. ఎందుకంటే, ప్రేమ చాలా అరుదైన అనుభవాలలో ఒకటిగా తయారైంది. అవును, ప్రేమ గురించి మనం చాలా ప్రసంగాలు చేశాం, కథలు, పాటలు రచించాం, చలన చిత్రాలు తీశాం. అవి మీకు పత్రికలలో, రేడియో, టెలివిజన్ కార్యక్రమాలలో కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటాయి. ప్రేమంటే ఏమిటో సరిగా తెలుసుకునేందుకు కావలసిన భావజాలాన్ని మీలో కలిగిస్తూ మీకు సహకరించే పనిలో నిమగ్నమై ఉన్న అనేకమందితో కూడిన గొప్ప పరిశ్రమ మీకోసం సిద్ధంగా ఉంది. అయినా ప్రేమ ఇప్పటికీ ఏమాత్రం అర్థంకాని విషయంగానే మిగిలిపోయింది. కానీ, అది అందరికి అతి ఎక్కువగా తెలిసినదైన విషయమై ఉండాల్సింది.
"ఆహారమంటే ఏమిటి?" అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీకు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. ఎందుకంటే, పుట్టినప్పటి నుంచి అసలు ఎప్పుడూ ఆహారాన్ని ఏమాత్రం రుచి చూడకుండా ఆకలితో అలమటించే వ్యక్తి మాత్రమే అలా అడుగుతాడు. “ప్రేమంటే ఏమిటి?" అని అడగడం కూడా దాదాపు అలాంటిదే.
ఆత్మకు ప్రేమే ఆహారం. కానీ, ఇంతవరకు దానికి అది దక్కలేదు. అందుకే ప్రేమ రుచి తెలియని మీరు ఆ ఆకలితో నకనకలాడుతూ “ప్రేమంటే ఏమిటి?” అని అడుగుతున్నారు. అలా అడగడం సమంజసమే అయినప్పటికీ అలాంటి పరిస్థితి దాపురించడం మాత్రం చాలా దురదృష్టకరం. శరీరానికి ఆహారం దక్కింది కాబట్టి, అది జీవంతో కొనసాగుతోంది. కానీ, ఆత్మకు ఆహారమైన ప్రేమ దానికి దక్కలేదు. అందుకే అది మరణించింది లేదా అది ఎప్పుడూ మరణశయ్యపైనే ఉంది. ఇంకా అది ఇంతవరకు జన్మించలేదు.
ప్రేమించేందుకు, ప్రేమించబడేందుకు కావలసిన సామర్థ్యంతోనే మనం జన్మించాం. ప్రతి శిశువుకు ప్రేమంటే ఏమిటో పూర్తిగా తెలుసు. ఎందుకంటే, ప్రతి శిశువు పరిపూర్ణమైన ప్రేమతోనే జన్మిస్తుంది. కాబట్టి, ప్రేమంటే ఏమిటో శిశువుకు..............