సెక్యూరిటీ తాత
నేను చాలా చిన్న కుక్కపిల్లని. నాతో పాటు నా వాళ్ళు కూడా వున్నారు. మేమందరం, మా అమ్మ వెనకాలే ఒక వీధిలో నడుస్తున్నప్పుడు, మరేమయిందో ఏమో.., నేను టపక్కున ఎందులోనో పడ్డాను. నేను నడవలేకపోయాను. పైకి ఎక్కలేకపోయాను. నా ముందువెనక ఎవ్వరూ కనబడలేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారేమో..., భయం వేసి, పెద్దగా "కుయ్.. కుయ్.. కుయ్..." అనటం మొదలెట్టాను.
అప్పుడు ఒక చేయి నన్ను నెమ్మదిగా అందులోంచి తీసి, ఎత్తుకొని తీసుకెళ్ళింది. ఆయన ఏడవద్దని చక్కగా నా తలమీద నిమిరి, నన్ను తనతో తీసుకెళ్ళాడు.
నగరానికి దూరంగా, చాలా పెద్ద స్థలంలో, కొత్త ఇళ్ళు కడుతున్నారు. ఎన్నో గేట్లు కూడా వున్నాయి. విల్లాలు కట్టే గేటు నంబరు ఏడు. అక్కడ సెక్యూరిటీ తాతది ఒక చిన్న రేకు గది. .......................