1955 మే 20, శుక్రవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలు.
చేంబోలు సీతారామశాస్త్రి కన్ను తెరిచిన రోజు.
తెలుగు సినిమా పాటలపై సిరివెన్నెల కురిసిన రోజు.
కానీ ఆయన పుట్టింది మాత్రం తెలుగు నేలలో కాదు.
మధ్యప్రదేశ్లోని సివ్నీ అనే మున్సిపాలిటీ పరిధిలో.
అప్పట్లో వారి తాతయ్య అక్కడ రైల్వేస్ స్టేషన్ మాస్టర్.
లోతైన లోయలు, ఎత్తయిన కొండలు, దట్టమైన అడవులు, స్వచ్ఛమైన గిరిజనులు - ఇవన్నీ గుర్తొస్తాయి సివ్నీ అంటే!
రుడ్యార్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్' పుస్తకాల్లో వర్ణించిన అడవులు ఇక్కడివే.
గోదావరికి ఉపనది అయిన 'వైన్ గంగ' జన్మస్థలం ఇక్కడే.
ఈ వైన గంగ-ఆపై వార్ధా నదితో కలిసి- ప్రాణహితగా మారి - తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరితో సంగమిస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్పటిక శివ లింగం ప్రతిష్ఠితమైన దిఘోరీ గ్రామం ఈ సివ్నీకి పాతిక కిలోమీటర్ల దూరంలోనే ఉంది..................