స్వరకాయ ప్రవేశం
కొంతమంది జీవితాంతం కవిత్వం రాస్తారు. కొంతమంది అప్పుడప్పుడూ రాస్తారు. మరికొంతమంది పాతికేళ్ళకే మానేస్తారు. ఎవరు ఎలా రాసినా అదంతా కవిత్వమే కదా! వాళ్ళ వాళ్ళ ప్రవృత్తుల్ని, తత్వాల్ని బట్టి కవిత్వం కొనసాగించడం జరుగుతుంది.
కవిత్వం ఎప్పుడూ యవ్వనంతో ధగధగలాడుతుంది. యవ్వనంలో రాసే కవితే జ్వలిస్తుంది. రాగరంజితంగా ఉంటుంది. తరువాత కాలంలో రాసినా అదంతా దానికి కొనసాగింపే అనిపిస్తుంది.
సుప్రసిద్ధ ఫ్రెంచి కవి రింబో తన పదిహేనో ఏటకే కవిత్వం మానేశారు. జర్మన్ మహాకవి ఎనభై సంవత్సరాల వయసులోనూ ప్రేమ కవితలు రాశాడు.
పెద్దిరెడ్డి గణేష్ స్నేహానికి విలువనిచ్చే మనిషి. ఎదుటి మనిషిని పాక్షికంగా ప్రేమించడం ఆయన చేత కాదు, ఏది చేసినా పరిపూర్ణంగా నిర్వర్తిస్తాడు. తన జీవితానుభావాలకు, అనుభూతులకు రంగులద్ది తొలియవ్వనం రోజుల్నించే ఆయన కవితలు రాసుకున్నాడు. దశాబ్దాలుగా వాటిని దాచుకున్నాడు. వాటిని 'గానగాత్ర' మన్న కవితా సంపుటిగా తెచ్చాడు.....................