'పడమటి సినిమా పరిమళం'ను సిరీస్ తీసుకురావాలని ఉంది
151 సినిమాలు డైరెక్ట్ చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన 'దర్శకరత్న' దాసరి నారాయణరావు ఫేవరెట్ హాలీవుడ్ మూవీ ఏమై ఉంటుంది?
సుమారు 65 ఏళ్ల సినీ కెరీర్ కలిగి 93 ఏళ్ల వయసులోనూ సినిమానే శ్వాసిస్తున్న 'దర్శక ధీశాలి' సింగీతం శ్రీనివాసరావు మనసు దోచుకున్న అంతర్జాతీయ చిత్రం ఏంటో తెలుసుకోవాలనే కుతూహలం అందరిలోనూ ఉంటుంది.
కథ - స్క్రీన్ ప్లే రహస్యాలు తెలిసిన మహా రచయిత త్రిపురనేని మహారథి. అమితంగా ఇష్టపడ్డ పాశ్చాత్య సినిమా వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి!
'ఎర్ర' సినిమాలతో వెండితెరపై ఒక ఉద్యమం లేవనెత్తిన ఆర్.నారాయణమూర్తి ఫేవరెట్ హాలీవుడ్ మూవీ ఏంటో మీరు ఊహించను కూడా ఊహించలేరు.
వంశీ -
కృష్ణవంశీ -
సుకుమార్ -
తనికెళ్ల భరణి -
ఇలాంటి హేమాహేమీలందరూ తమ ఫేవరెట్ హాలీవుడ్ సినిమాల గురించి వాళ్లే విశ్లేషించి చెబుతుంటే ఎంత బావుంటుంది.
ఎస్... ఈ 'పడమటి సినిమా పరిమళం'తో అలాంటి ప్రయత్నమే జరిగింది. ఇరవై ముగ్గురు సినిమా ప్రముఖులు తమ ఫేవరెట్ హాలీవుడ్ మూవీస్ గురించి ఇందులో విశ్లేషించారు. వీటిల్లో కొన్ని 'సాక్షి' దినపత్రికలో ప్రచురితమయ్యాయి. 2014లో నేను 'సాక్షి' సినిమా పేజీ ఇన్ఛార్జ్ పని చేస్తున్నప్పుడు ప్రతి సోమవారం 'హాలీవుడ్' ఫీచర్ పేరుతో కొందరు సినీ ప్రముఖుల నుంచి ఈ వ్యాసాలు నేనే సేకరించాను. అప్పటి మా ఫీచర్స్.................