పడమటి గాలి
ఉత్సాహంగా ఇంట్లోకి అడుగు పెట్టింది ప్రీతి, ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఏదైనా సినిమా చూస్తున్నారేమో అనుకుని ఆ రూమ్కి వెళ్లింది. ఖాళీగా ఉంది
ఇల్లంతా కలయ చూస్తూ, “సోనూ, మోనూ” అని పిల్లల్ని పిలిచింది. “మమ్మా” అంటూ వాళ్ళు ఎప్పటిలాగా ఎదురు రాలేదు. సమాధానం కూడా రాలేదు.
ఆలోచిస్తూనే చేతిలో ఉన్న పాకెట్లని, సంచుల్ని డైనింగ్ టేబుల్ మీద ఉంచి, పైకెళ్ళి, పిల్లల గదులు చూసింది.
అవి ఖాళీగా ఉన్నాయి. సాధారణంగా ఆ సమయాన వంటింట్లో ఉండే రాజేశ్వరి కోసం చూసింది. ఆమె లేదు. పిల్లలూ లేరు. అంతా ఎక్కడికి వెళ్ళారు? ప్రీతి ఆలోచనలో పడింది.
రాజేశ్వరి పిల్లల్ని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిందేమో! ఎక్కడికైనా వెళ్తే ఓ మెసేజ్ ఫ్రిజ్ కి అంటించి వెళ్తుంది. అలా ఏదైనా మెసేజ్ ఉందేమోనని ఫ్రిజ్ కేసి చూసింది. అక్కడున్నవన్నీ పాతవి.............
గంటి భానుమతి నవల