పథకం
ఫ్లబీవర్ బ్రిడ్జి మీదనుంచి దూరంగా చూశాడు ద్వివేది.
విశాలమైన ప్రాంతం. ఆ ప్రాంతమంతా రైల్వే ట్రాక్స్. ఎక్కువ ట్రాక్స్ మీద గూడ్స్ రైళ్ళు వున్నాయి. ఖాళీగా వున్న ట్రాక్సిమీద చెత్త కాగితాలు, ప్లాస్టిక్ గ్లాసులు, పొలిథిన్ కవర్లు ఏరుకునేవాళ్ళు తిరుగుతున్నారు. అక్కడక్కడా రైల్వే సిబ్బంది తచ్చాడుతున్నారు. ద్వివేది నిట్టూర్చాడు.
నగర జీవితం విచిత్రమైంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎవరూ నగరం వదిలి వెళ్ళాలనుకోరు. నగర జీవితంలో వున్న మత్తు అలాంటిది. అందులోనూ గ్రేటర్ ముంబై మరీనూ. జిల్లా మొత్తం ముంబై ఆక్రమించుకుంటూ ప్రక్క జిల్లాలకి పాకుతోంది. ట్రాక్స్ మీద నుంచి చూపు ప్రక్కకి మళ్ళించాడు ద్వివేది.
విశాలమైన రోడ్డుమీద జనం ప్రవాహంలా సాగిపోతున్నారు. ఉరుకుల పరుగులు గోదారిలా, సముద్రపు కెరటాల్లా జనం... జనం... జనం.
ద్వివేది మరోసారి నిట్టూర్చాడు.
తల్లితోపాటు నగరం వచ్చి సంవత్సరాలే అయింది. ఇప్పుడు అమ్మకి వైద్య పరీక్షలు జరిగాయి. రిపోర్ట్ తెస్తుంది అమ్మ. ఇంటికి వెళితే ఎలాంటి కబురు వినవలసి వస్తుందో తెలియదు. ద్వివేదికి గుండెలు గుబగుబలాడాయి. అమ్మకి ఎలా వుందో, ఏం రాస్తారో? అతను ఉలిక్కిపడ్డాడు.
తనని ఎవరో కనిపెడుతున్న భావన. ఆలోచనల్లో మునిగిపోయి పరిసరాలను మర్చిపోయాడు. పొరపాటు గుర్తించి చప్పున చుట్టూ చూశాడు. మరుక్షణమే గుర్తుపట్టాడు ద్వివేది...................