₹ 200
పుట్టుకతోనే అంగవైకల్యంతో పుట్టిన సాగర్ ఘోష ఈ నవల। అంగవైకల్యంతో పాటు పేదరికంతో కూడా పోరాడి గెలిచిన సాగర్ తనలోని అంతర్ బహిర్ లోకాన్ని ఆవిష్కరిస్తూ, తన ఆంతరంగ కల్లోలాల్ని అక్షరబద్దం చేస్తూ రాసుకున్న ఆత్మ కథే "పడిలేచే కెరటం"। అంగవైకల్యం ఉన్న వ్యక్తుల్లో పోరాట పటిమను, స్ఫూర్తిని నింపే నవల ఇది।
అంగవైకల్యంతో బాధపడేవాళ్ళలో సున్నితంగా వ్యవహరించాలని తెల్సినా కొంతమంది , తెలియకుండా చాలామంది వాళ్ళని మానసికంగా హింస పెడుతుంటారు। అంగవైకల్యం ఉన్న వ్యక్తుల విషయంలో మన సమాజంలో ఉన్నంత ఇన్సెన్సిటివ్ గా మారె దేశంలోనూ ఉండరేమో, వాళ్ళని తమ చూపుల్తో, మాటల్తో చేతలతోగాయాపారిచేవాళ్ళెందరో। చదువులేని జులాయి మనుషులు మాత్రమే వీళ్ళని ఎగతాళి చేసి బాధపెడతారనుకోవడం అపోహ మాత్రమే। ఉన్నత విద్యావంతులు, ఉన్నత హోదాల్లో ఉన్నవాళ్ళు కూడా సంస్కారహీనంగా వాళ్ళని అవహేళన చేసి అవమానపరుస్తుంటారు। " ఈ నవల హృదయంతో చదవండి। వాళ్ళ హృదయ ఘోష విన్పిస్తుంది। మీకళ్ళకు కొందరి జీవితాల్లో మనుషులు అనాలోచితంగానో, అహంకారంతోనో చేసే గాయాలు కన్పిస్తాయి।।
- Title :Padileche Keratam
- Author :Saleem
- Publisher :JV Publications
- ISBN :MANIMN1143
- Binding :Paperback
- Published Date :2020
- Number Of Pages :368
- Language :Telugu
- Availability :instock