2016లో ఫిలిప్పీనక్కు వెళ్లినపుడు నాకు ఎడ్విన్ కార్డివిల్లాతో పరిచయమయ్యింది. కొద్దిరోజుల పరిచయం స్నేహంగా మారడం, అతడు నాకు తన పుస్తకం 'పదివేల పంక్తులు' Ten Thousand Lines - బహుమతిగా ఇవ్వడం, ఓ గొప్ప జ్ఞాపకం. నేను ఇండియాకు రాగానే ఆ పుస్తకాన్ని కొంత ఆసక్తితో చదవడం ప్రారంభించి క్రమేపీ కవి భావనలలో కలిసిపోయాను.
'ప్రపంచశాంతి కోసం Edwin Cordevilla వ్రాసిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేయాలని, తెలుగు సాహితీ ప్రియులకు ఈ అద్భుత పుస్తకాన్ని అందించాలనుకుని వెంటనే ఆలోచనను కార్యరూపంలోకి తీసుకువచ్చాను. ఇంతవరకూ ఏ కవీ చేయని సాహసాన్ని చేసిన Edwin Cordevilla గ్రంథపు అనువాదాన్ని తెలుగు సాహితీలోకం ఆదరిస్తుందని ఆశిస్తూ...
- డాక్టర్ లంకా శివరామప్రసాద్