అల్లు రామలింగయ్యగారి అబ్బాయి అనిపించుకోవడమే నాకిష్టం
“నాన్నగారు టెన్త్ క్లాస్ కూడా పూర్తిచేసి ఉండరు కానీ హెూమియోపతి డాక్టరు కాగలిగారు. నాన్నగారికి నోరి నారాయణమూర్తిగారని స్నేహితుడుండేవారు, ఆయన లాయరు, లాయరే కాదు హెూమియోపతి డాక్టరు కూడా. ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వారివద్ద మెళకువలు నేర్చుకున్నా.. మద్రాస్ వచ్చి సినిమాల్లో రాణిస్తున్న సమయంలో హెూమియోపతి ప్రాక్టీస్ చేసేవాళ్ళందరూ పరీక్ష రాస్తే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ కావొచ్చని ఒక ప్రకటన వస్తే విజయవాడ వెళ్ళి ఆ పరీక్ష రాసి పాసై, ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి మాకు చూపించారు. అంటే తనను తాను నిరూపించుకోవాలనే తపన నిరంతరం నాన్నగారిలో మాకు కనిపించేది. అయితే నాకు పదహారు, పదిహేడేళ్ళు వచ్చేసరికి ఫైనాన్షియల్గా సలహాలు నన్నడిగేవారు. ఇంత మౌంట్ వచ్చింది దీన్నేం చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలి అని నన్నడిగేవారు. నాదగ్గర మ్యాటర్ ఉందనుకునేవారు....
మా నాన్నగారు మాకు ఇచ్చిన వరాలలో ఒకటి మధ్యతరగతి మాధుర్యం. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకలా అన్నానంటే విశాలమైన భవంతిలో ఒక్కొక్కరు ఒక్కోచోట కాకుండా, ఒకేచోట పెరగడం, అక్కడే తిట్టుకోవడం, కొట్టుకోవడం, బ్రతిమలాడుకోవడం, పది నిమిషాల్లోనే సర్దుకుపోవడం, పద్మశ్రీ డాక్టర్ అల్లు రామలింగయ్య జీవిత చిత్రం - 7.................................