సిని'మావిడి' కొమ్మ మీద... సిరివెన్నెల పూత...
ఒరే అన్నయ్యా !
మొట్టమొదటిసారి మనం మద్రాస్ స్రవంతి మూవీస్ ఆఫీసులో కలిసినప్పుడు ఒకళ్ళకొకళ్ళం
"నేను భరణి!" అన్నాన్నేను
"నేనూ భరణే!" అన్నావు నువ్వు “నేను తనికెళ్ళ భరణి"
"నా కలం పేరు భరణి"
"నీ ఇష్టం... నువ్వు పెద్దాడివి” “నువ్వు చిన్నాడివి... నాకిష్టం”
అప్పట్నుంచీ నువ్వు నన్ను “ఒరే... భరణి...”
నేనేమో “ఒరే అన్నయ్యా...” ఇది గదా మన బంధం...
లేడీస్ టైలర్ పాటలన్నీ రాసి ఒక్క పాట దగ్గరకొస్తే ఎక్కువ ఇరుక్కుపోయావ్. అదే... "ఎక్కడ... ఎక్కడ... ఎక్కడ... ఎక్కడ దాక్కున్నావే”
"చూడా... ఇళయరాజాకి రెండు లారింక్స్ (స్వరపేటిక) ఉన్నాయ్ కదా లల్లర లల్లర... అల్లర... అల్లరల్లర అని ఎలా ఇచ్చాడో!”
దానికి నేనన్నాను... “ఎందుకంత కష్టపడతావ్ అన్నయ్యా! ఏబీసీడీఈఎఫ్.... జీహెచ్... అంటూ వరసకట్టి లాగించేయ్యి” అన్నాను.
"ఏడిశావ్ పెద్దవ్వా” అని తిట్టిపోసి... రెండు రోజులు కుస్తీ పట్టి... పుట్టుమచ్చ పాటని... చెరిగేశావ్... అది గదా... నీ జప్రతిజభ... అంటే ప్రతిభ అని... మొత్తానికి నీ పాటలు మీదగాని నీ మీదగాని... ఒక్క “జమజచ్చ” ఉంటే ఒట్టు...
నువ్వెక్కడికో వెళ్ళిపోయావనుకునీ... నీకోసం ఒక కొత్త సిరివెన్నెల కుటుంబం వెలిసిందిక్కడ... ఒక్క కుటుంబం ఏవిట్లే, భూప్రపంచంలో ఉన్న...................